న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం

ABN , First Publish Date - 2021-07-28T08:41:22+05:30 IST

న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘాల నేతలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హామీ ఇచ్చారు.

న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం

బీసీ సంఘం నేతలకు సీజేఐ ఎన్వీ రమణ హామీ

న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘాల నేతలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ హామీ ఇచ్చారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్‌ రావు ఢిల్లీలో జస్టిస్‌ ఎన్వీ రమణను కలిశారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. తమ విజ్ఞప్తుల పట్ల జస్టిస్‌ ఎన్వీ రమణ సానుకూలంగా స్పందించారని జాజుల శ్రీనివాస్‌ చెప్పారు. 

Updated Date - 2021-07-28T08:41:22+05:30 IST