ఇలా అయితే కరోనా గండం దాటేదెట్లా?

ABN , First Publish Date - 2021-05-08T06:26:43+05:30 IST

ఊరూరా కరోనా తిష్టవేసింది.. జనంపై వైరస్‌ పంజా విసురుతోంది. వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పె ట్టుకుని ఆస్పత్రుల్లో బిక్కుబిక్కుమంటుంటే... జనంలో మాత్రం నిలువెల్లా తా త్సారం కనబడుతోంది. రచ్చబండలు, కూడళ్లు, బ్యాంకులు ఇలా ఒకచోటేమి టీ... ఎక్కడ చూసినా గుంపులుగా చేరి వైరస్‌ వ్యాప్తిని మరింత ఉధృతం చే స్తున్నారు.

ఇలా అయితే కరోనా గండం దాటేదెట్లా?
కుందుర్పి కెనరా బ్యాంకులో గుంపులుగా తోసుకుంటున్న ఖాతాదారులు

తాడిపత్రి/కుందుర్పి/యల్లనూరు, మే 7: ఊరూరా కరోనా తిష్టవేసింది.. జనంపై వైరస్‌ పంజా విసురుతోంది. వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పె ట్టుకుని ఆస్పత్రుల్లో బిక్కుబిక్కుమంటుంటే... జనంలో మాత్రం నిలువెల్లా తా త్సారం కనబడుతోంది. రచ్చబండలు, కూడళ్లు, బ్యాంకులు ఇలా ఒకచోటేమి టీ... ఎక్కడ చూసినా గుంపులుగా చేరి వైరస్‌ వ్యాప్తిని మరింత ఉధృతం చే స్తున్నారు. కరోనా కల్లోలంలో ఇదేమి వైచిత్రి అంటూ చూస్తున్న జనం విస్తుపోతున్నారు. కరోనా అనేక మంది ప్రాణాలు బలిగొంటున్న తరుణంలో కుందుర్పి కెనరా బ్యాంకులో నిబంధనలు గాలికొదిలారు. శుక్రవారం ఖా తాదారులు భౌతికదూరం లేకుండా గుంపులుగా తోసుకుంటూ ఎగబడ్డారు. కరోనా నేపథ్యంలో పోలీసులు, బ్యాంకు సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని నె త్తినోరు కొట్టుకున్న రైతులు మాత్రం పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్దకు వస్తున్నారు. ఈబ్యాంకు పరిధిలో 6వేలు మందికి పైచిలుకు రైతులు పంట రుణాలు పొందారు. రెన్యువల్‌ కోసం తిప్పలు పడుతున్నారు.


144 సెక్షన ఎక్కడ?

కరోనా నేపథ్యంలో యల్లనూరు మండలంలో 144 సెక్షన అమలులో ఉందా  అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం పా తపేట ప్రధాన రహదారిపై జనం గుమికూడారు. వరుసగా కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ కనిపించారు. తాడిపత్రి పట్టణంలో ఒకవైపు పోలీసులు జరిమానాలు విధిస్తున్నా మరోవైపు ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.  నందలపాడు సర్కిల్‌లో శుక్రవారం సాయంత్రం 6:30గంటల సమయంలో పెద్దఎత్తున జనం గుమికూడడం కనిపించింది. రోడ్డు డివైడర్ల మధ్యన కూ ర్చొని బాతాకాని కొట్టడం కనిపించింది. ఇన్ని అజాగ్రత్తల నడుమ కరోనా వైరస్‌ గండం దాటడం ఎలాగన్నదే ప్రశ్నార్థకమవుతోంది. 



Updated Date - 2021-05-08T06:26:43+05:30 IST