స్విమ్మింగ్‌ఫూల్‌లో విషపూరిత పాము కలకలం

ABN , First Publish Date - 2021-01-16T16:16:41+05:30 IST

ఆస్ట్రేలియాకు చెందిన ఒక కుటుంబానికి ఆ క్షణంలో ప్రాణం పోయినంతపనైంది.

స్విమ్మింగ్‌ఫూల్‌లో విషపూరిత పాము కలకలం

కాన్బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన ఒక కుటుంబానికి ఆ క్షణంలో ప్రాణం పోయినంతపనైంది. వారి ఇంటి ఆవరణలో గల స్విమ్మింగ్ ఫూల్‌లో అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. వివరాల్లోకి వెళితే ఎడిల్యాండ్‌లోని మారినో ప్రాంతంలోని ఒక స్విమ్మింగ్ ఫూల్‌లో పెద్ద పాము కనిపించింది.


దీనికి సంబంధించిన వీడియోను స్నేక్ క్యాచర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే... ‘గోధుమ రంగులో మెరిసిపోతున్న ఈ పాము వేడి నుంచి తట్టుకునేందుకు ఈ స్విమ్మింగ్ ఫూల్‌లోనికి ప్రవేశించింది’ అని తెలిపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన ఒక యూజర్... ‘ఇకపై ఎవరైనా సరే స్విమ్మింగ్ ఫూల్‌లోకి దూకేముందు ఒకసారి చూసుకోండి’ అని రాయగా, మరొకరు ‘ఈత సుందరి’ అని రాశారు.

Updated Date - 2021-01-16T16:16:41+05:30 IST