250 సార్లు పాము కాటు వేసినా...కోలుకున్న స్నేక్ మ్యాన్

ABN , First Publish Date - 2022-02-03T17:14:13+05:30 IST

ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ నాగుపాము కాటు నుంచి ఎట్టకేలకు కోలుకున్నారు...

250 సార్లు పాము కాటు వేసినా...కోలుకున్న స్నేక్ మ్యాన్

కొట్టాయం(కేరళ): ప్రముఖ  స్నేక్ క్యాచర్ వావా సురేష్ నాగుపాము కాటు నుంచి ఎట్టకేలకు కోలుకున్నారు.కొట్టాయం వైద్యకళాశాలలో వెంటిలేటరుపై చికిత్స పొందిన సురేష్ తనంతట తానుగా శ్వాస తీసుకోవడం ప్రారంభించాడని, అతని ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించిందని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ టికె జయకుమార్ చెప్పారు.సురేష్ ను మరో రెండు రోజులపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని డాక్టర్ తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది.కేరళలో  స్నేక్ క్యాచర్ గా పేరుగాంచిన సురేష్ ఇప్పటివరకు 50,000 పైగా పాములను రక్షించారు. సురేష్  నేషనల్ జియోగ్రాఫిక్, యానిమల్ ప్లానెట్ ఛానెల్‌లలో కూడా పలు వీడియోలు చేశారు.


సురేష్‌ని ముద్దుగా ‘'స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళ’గా పిలుస్తున్నారు.ఈయన 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించారు.జనవరి 31 న కొట్టాయంలోని మానవ నివాస స్థలం నుంచి పామును పట్టుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు పాము కాటుకు గురయ్యాడు.తీవ్ర అస్వస్థతకు గురైన సురేష్ ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని వెంటిలేటర్ సపోర్ట్ కోసం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు.10 అడుగుల నాగుపామును పట్టుకొని గోనె సంచిలో వేస్తుండగా సురేష్ కాటుకు గురయ్యాడని కొట్టాయంలోని కురిచ్చి వాసులు చెప్పారు. 


‘‘పాము కాటు వేసినప్పటికీ, అతను పామును సురక్షితంగా గోనెసంచిలో ఉంచాడు. అతను కొన్ని నిమిషాల తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్నాడు’’ స్థానిక వాసి ఒకరు చెప్పారు.తాను 250సార్లు పాము కాటుకు గురయ్యానని సురేష్ చెప్పారు. పాము కాటు కారణంగా అతను తన చూపుడు వేలు, కుడి మణికట్టులో కదలికలను కూడా కోల్పోయాడు.కేరళ అటవీ శాఖ అతనికి ఉద్యోగం ఇచ్చింది, కానీ అతను పాముల కోసం తన జీవితాన్ని అంకితం చేయలేనని చెప్పి దానిని తీసుకోవడానికి నిరాకరించాడు.


Updated Date - 2022-02-03T17:14:13+05:30 IST