Viral Video: వీళ్ల తెలివి తెల్లారిపోనూ.. అక్రమ మద్యం రవాణాకు Bolero వాహనాన్ని వాడుతున్న తీరును చూసి ఆనంద్ మహీంద్రా సెటైర్లు..!

ABN , First Publish Date - 2022-09-02T21:18:28+05:30 IST

సరుకు రవాణాకు అనువైనదిగా, మంచి పికప్‌నకు మారు పేరుగా నిలుస్తూ వినియోగదారుల మనసులను గెలుచుకుంది మహీంద్రా బొలేరో వాహనం

Viral Video: వీళ్ల తెలివి తెల్లారిపోనూ.. అక్రమ మద్యం రవాణాకు Bolero వాహనాన్ని వాడుతున్న తీరును చూసి ఆనంద్ మహీంద్రా సెటైర్లు..!

సరుకు రవాణాకు అనువైనదిగా, మంచి పికప్‌నకు మారు పేరుగా నిలుస్తూ వినియోగదారుల మనసులను గెలుచుకుంది మహీంద్రా బొలేరో వాహనం (Mahindra Bolero). ధర కాస్త ఎక్కువైనా చాలా మంది సరకు రవాణా కోసం బొలేరో వాహనాన్నే వినియోగిస్తుంటారు. అయితే తాజాగా బీహార్‌ (Bihar)లో కొందరు బొలేరో వాహనాన్ని స్మగ్లింగ్ కోసం వినియోగించారు. తమ నైపుణ్యంతో బొలేరో వాహనం టాప్‌ను కాస్త మార్చి మద్యం బాటిళ్లను స్మగ్లింగ్ చేస్తున్నారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. 


బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉంది. దీంతో స్మగ్లింగ్‌కు తెర లేచింది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా పలు మార్గాల్లో మద్యం అక్రమంగా రవాణా అవుతూనే ఉంది. తాజాగా ఓ గ్యాంగ్ బొలేరో వాహనాన్ని తమ స్మగ్లింగ్‌కు అనుకూలంగా మార్చుకుంది. వాహనం టాప్‌ను కాస్త పైకి లేపి వెల్డింగ్ చేశారు. లోపల 960 చిన్న బాటిళ్లతో కూడిన 20 కార్టన్ల మద్యంను దాచి (smuggling bottles of illegal liquor) రవాణా చేస్తున్నారు. ఆ వాహనం ద్వారా మద్యం స్మగుల్ అవుతున్న సంగతి పోలీసులకు తెలిసింది. దీంతో వారు వెంటనే ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అయితే ఆ వాహనంలో మద్యం ఎక్కడుందో వారికి అంతు చిక్కలేదు. మొత్తం వాహనం అంతా తనిఖీ చేసి చివరకు టాప్ పైన వెల్డింగ్ చేసి ఉండడాన్ని గమనించి దానిని పైకి లేపారు. 


లోపల మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ వీడియో వైరల్ కావడంతో మహీంద్రా సంస్థల అధిపతి ఆనంద్ మహీంద్రా స్పందించారు. వారి నైపుణ్యం చూసి షాకయ్యారు. `దురదృష్టవశాత్తూ, వీరు తప్పుడు మార్గంలోకి వెళ్ళారు. లేకుంటే వారు క్రియేటివ్ ఆటోమోటివ్ డిజైన్ ఇంజనీర్లు అయి ఉండేవారు` అని ట్వీట్ చేశారు.  



Updated Date - 2022-09-02T21:18:28+05:30 IST