సంప్రదాయ నృత్యం చేసిన స్మృతి ఇరానీ

ABN , First Publish Date - 2022-02-19T21:49:40+05:30 IST

రాజకీయ నేతల ఎన్నికల ప్రచారంలో ఒక్కోసారి ఆసక్తికరమైన సంఘటనలు..

సంప్రదాయ నృత్యం చేసిన స్మృతి ఇరానీ

ఇంపాల్: రాజకీయ నేతల ఎన్నికల ప్రచారంలో ఒక్కోసారి ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. మణిపూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అక్కడున్న కళాకారులతో కలిసి సంప్రదాయ నృత్యం చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది. మణిపూర్‌లోని బీజేపీ యూనిట్ ట్విట్టర్ ఖాతాలోనూ ఈ వీడియో పోస్ట్ చేశారు. గౌరవనీయురాలైన స్మృతి ఇరానీ సంప్రదాయ మణిపురి కళాకారులతో కలిసి అడుగులో అడుగు వేసి నృత్యం చేసినట్టు ఆ ట్వీట్ పేర్కొంది.


నృత్య కళాకారిణులు తమ ప్రతిభను ప్రదర్శిస్తుండగా స్టేజిపై ఉన్న స్మృతి ఇరానీ కొద్ది సేపటికి స్టేజీ దిగి కిందకు వచ్చారు. కళాకారుల స్టెప్టులను నిశితంగా పరిశీలించి ఆ తర్వాత వారితో కలిసి నాట్యం చేస్తూ అలరించారు. 60 సీట్లు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఫిబ్రవరి 27, మార్చి 3వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న కౌంటింగ్ జరగనుంది.

Updated Date - 2022-02-19T21:49:40+05:30 IST