అంగన్‌వాడీల్లో స్మార్ట్‌వర్క్‌

ABN , First Publish Date - 2021-12-21T06:57:05+05:30 IST

విధి నిర్వహణలో అంగన్‌వాడీల అలసత్వానికి, వారిపై వస్తున్న అవినీతి ఆరోపణలకు చెక్‌పడనుంది. అంగన్‌వాడీకేంద్రాల నిర్వహణ, లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సేవలలో పారదర్శకత పాటించే లక్ష్యంతో ప్రతీ అంగన్‌వాడీ టీచర్‌కు అందిస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌ వైజర్లకు చేరాయి. దీంతో ఇకనుంచి అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, కార్యకలాపాలన్నీ వెంటవెంటనే ఆన్‌లైన్‌ కానున్నాయి.

అంగన్‌వాడీల్లో స్మార్ట్‌వర్క్‌

కేంద్రాల కార్యకలాపాలన్నీ ఇక నుంచి స్మార్ట్‌ ఫోన్లతోనే 

అలసత్వం, అవినీతి ఆరోపణలకు చెక్‌

ఉమ్మడి జిల్లాలోని 4,203 మంది అంగన్‌వాడీ టీచర్లకు పంపిణీ 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

 విధి నిర్వహణలో అంగన్‌వాడీల అలసత్వానికి, వారిపై వస్తున్న అవినీతి ఆరోపణలకు చెక్‌పడనుంది. అంగన్‌వాడీకేంద్రాల నిర్వహణ, లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సేవలలో పారదర్శకత పాటించే లక్ష్యంతో ప్రతీ అంగన్‌వాడీ టీచర్‌కు అందిస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌ వైజర్లకు చేరాయి. దీంతో ఇకనుంచి అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, కార్యకలాపాలన్నీ వెంటవెంటనే ఆన్‌లైన్‌ కానున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల విధులన్నింటినీ ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. దీంతో అంగన్‌వాడీ పనితీరు మెరుగుపడనుండగా అదే, సమయంలో అవినీతి తగ్గడం, లబ్ధిదారులకు పూర్తిస్థాయి లబ్ధిచే కూరనుంది. 

ఉమ్మడి జిల్లాలో 3,805 అంగన్‌వాడీ కేంద్రాలు, 398 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, మొత్తంగా 4,203 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ మేరకు 4,203 మంది అంగన్‌వాడీ టీచర్లకు, సుమారు 200మంది సూపర్‌వైజర్లకు స్మార్ట్‌ఫోన్లు అందిస్తున్నారు. మెజార్టీ స్మార్ట్‌ఫోన్ల పంపిణీ ఇప్పటికే పూర్తయింది. అందరికీ స్మార్ట్‌ ఫోన్లు అందాక సెక్టర్‌ లేదా, ప్రాజెక్టువారీగా స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ఈనెల చివరి నాటికి స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఆ స్మార్ట్‌ఫోన్లలో టాక్‌టైం ఉండకపోవడం, కేవలం అంగన్‌వాడీ సేవలకు మాత్రమే వినియోగించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అయితే  ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్లకు ఉన్న గ్రూప్‌ సెల్‌ నెంబర్లనే వినియోగిస్తారా లేక కొత్త నెంబర్లను కేటాయిస్తారా అనే అంశంపై త్వరలో స్పష్టతరానుంది. అలాగే స్మార్ట్‌ఫోన్లలోనే ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాల్సి ఉన్నందున ఇప్పటివరకు కొనసాగుతున్న 14రకాల రికార్డుల నమోదు కొనసాగిస్తారాలేక రద్దు చేస్తారా అనే విషయం కూడా త్వరలో తేలనుంది. 

స్మార్ట్‌ఫోన్‌పై వేలిముద్రల ద్వారా హాజరు 

అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు అందిస్తున్న స్మార్ట్‌ఫోన్లతో అంగన్‌వాడీకేంద్రాల నిర్వహణ గణనీయంగా మెరుగుపడింది. ఇప్పటికే ప్రతి అంగన్‌వాడీ కేంద్రాన్ని జియోట్యాగింగ్‌ చేసి టీచర్‌, ఆయా, లబ్ధిదారుల ఆధార్‌కార్డులను కేంద్రాలవారీగా లింక్‌అ్‌పచేశారు. దీంతో టీచర్‌, ఆయా అంగన్‌వాడీ కేంద్రాని కి వచ్చాకే స్మార్ట్‌ఫోన్‌పై వేలిముద్రల ద్వారా హాజరుఇవ్వాల్సి ఉంటుంది. అలాగే లబ్ధిదారులంతా స్మార్ట్‌ఫోన్‌పై వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. ఆవెంటనే హైదరాబాద్‌లోని స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలోని ప్రధానసర్వర్‌కు వివరాలు అందుతాయి. అలాగే జిల్లాలోని ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయానికి, సూపర్‌వైజర్ల స్మార్ట్‌ఫోన్లకు కూడా కేంద్రాలవారీగా ఎప్పటికప్పుడు వివరాలు చేరుతాయి. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో కంప్యూటర్‌లో ప్రతి అంగన్‌వాడీ కేంద్ర పాస్‌వర్డ్‌, యూజర్‌నేమ్‌ సంక్షిప్తమై ఉంటాయి. దీంతో అంగన్‌వాడీకేంద్రాల ద్వారా అందుతున్న 14 రకాల సేవలను, కేంద్రాల నిర్వహణ సమయం, టీచర్‌, ఆయాల హాజరు సమయాన్ని కమిషనర్‌, డైరెక్టర్‌స్థాయి నుంచి పీడీ, సీడీపీవో, సూపర్‌వైజర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. అలాగే సూపర్‌వైజర్లు కూడా సీడీపీవో కార్యాలయంనుంచే బయోమెట్రిక్‌ విధానంలో స్మార్ట్‌ ఫోన్‌ ఆధారంగా సంతకం చేయాల్సి ఉండడం, ప్రతిరోజూ విధిగా అంగన్‌వాడీకేంద్రాలను సందర్శించి తనిఖీ వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సీడీపీవోలు, పీడీలు కూడా రోజువారీగా సమీక్ష వివరాలను ప్రధానసర్వర్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

స్మార్ట్‌ఫోన్లతో కొద్దిమందికి ఇక్కట్లే..

సమాజంలో స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు పలువరు అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై అవగాహనలేదు. ఇందుకు ప్రధానంగా వయస్సు మీరిన వారు, ఇం గ్లీ్‌షపై కనీస పరిజ్ఞానం లేకపోవడం, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం తెలవకపోవడంతో ఆ తరహా టీచర్ల కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అయితే ప్రభుత్వంగతంలో పేర్కొన్నట్లు 60ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాలకు రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ కల్పి స్తూ ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. దీంతో ప్రభుత్వం ఆశించినట్లు అంగన్‌వాడీ సేవలు మెరుగవడంతోపాటు అర్హులైన మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అవుతుందని పేర్కొంటున్నారు. 

మెరుగైన ఫలితాలు సాధించవచ్చు  : రుక్మిణీదేవి, ఐసీడీఎస్‌ నల్లగొండ జిల్లా పీడీ

స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పర్యవేక్షణ పెరిగి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అంతేగాక పిల్లలు, గర్భిణులకు అందించే పౌష్ఠికాహారం కూడా దుర్వినియోగం కాకుండా ఉంటుంది. అర్హులైన వారికి పథకాలు అందుతున్నాయా లేదా అనేదానిపై నిఘా పెరుగుతుంది.

బాధ్యత మరింత పెరిగింది : బి.వినోద, అంగన్‌వాడీ టీచర్‌, భువనగిరి 

స్మార్ట్‌ఫోన్లతో అంగన్‌వాడీ టీచర్లపై మరింత బాధ్యత పె రగనుంది. అలాగే కేంద్రాల నిర్వహణపై వస్తున్న విమర్శలకు తెరపడనుంది. అయితే పలువురు టీచర్లకు స్మా ర్ట్‌ఫోన్ల వినియోగంపై అవగాహన లేకపోవడం తోఇబ్బందులు ఎదురుకానున్నాయి.

Updated Date - 2021-12-21T06:57:05+05:30 IST