సామర్లకోటలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-09-29T17:17:50+05:30 IST

మండలంలోను, పట్టణంలోను సోమవారం రాత్రి ఆకస్మికంగా భారీవర్షం కురిసింది. పట్టణంలో..

సామర్లకోటలో భారీ వర్షం

సామర్లకోట: మండలంలోను, పట్టణంలోను సోమవారం రాత్రి ఆకస్మికంగా భారీవర్షం కురిసింది. పట్టణంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీట ముంపులో ఉన్నాయి. ప్రధాన డ్రైన్లు పొంగి ప్రవహించడంతో రోడ్లపైకి మురుగునీరు చేరి దుర్ధందభరితంగా మారాయి. కొత్తూరు, జగ్గమ్మగారిపేట, ప్రకాష్‌నగర్‌, జయలక్ష్మీ టాకీస్‌ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ తదితర ప్రాంతాలు నీటి ముంపులో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని ఉప్పువారి స త్రం, వీకే రాయపురం, మాధవపట్నం, సత్యవరపుపేట ప్రాంతాల పొలాలు నీట ముంపులోనే ఉండగా రాత్రి కురిసిన భారీ వర్షానికి మరింత నీట ముంపు సమస్యకు లోనయ్యాయి.




Updated Date - 2020-09-29T17:17:50+05:30 IST