Abn logo
Jul 9 2021 @ 07:25AM

స్వీడన్‌లో కుప్పకూలిన చిన్న విమానం

స్టాక్‌హోమ్ (స్వీడన్): స్వీడన్ దేశంలో చిన్న విమానం కుప్పకూలిన దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు మరణించారు. స్వీడన్ దేశంలోని ఒరెబ్రో నగర విమానాశ్రయం నుంచి చిన్న విమానం గురువారం బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది.ఈ చిన్న విమానంలో పైలట్‌తో సహా 9 మంది ఉన్నారు.చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ (సిజిటిఎన్) ప్రకారం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరేబ్రోలో జరిగిన విమాన ప్రమాదంలో చాలా మంది మరణించారు.క్షతగాత్రుల సంఖ్యపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు. కానీ స్వీడన్ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం విమాన ప్రమాదంలో చాలా మంది మరణించారు.తీవ్ర గాయాలతో ఉన్న ఓ విమాన ప్రయాణికుడిని  ఆసుపత్రికి తరలించినట్లు సిజిటిఎన్ నివేదించింది.ఈ విమాన ప్రమాదంలో మరణించిన కుటుంబాల వారికి స్వీడన్ ప్రధాన మంత్రి స్టీఫన్ లోఫ్వెన్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ విమాన ప్రమాదానికి కారణాలు తెలియలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.