Abn logo
Aug 7 2020 @ 22:46PM

ఇళ్లముందు పుర్రెలు, ఎముకలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు

చెన్నై: తమిళనాడులోని పళని జిల్లాలో ఇళ్లముందు ఎముకలు, పుర్రెలు కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. స్థానిక దేవనగర్ వీధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు మూడు ఇళ్లు, ఒక దుకాణం ఎదురుగా ఈ పుర్రెలు, ఎముకలు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వీటిని ఇనుప తీగతో కట్టి ఇళ్లముందు విడిచిపెట్టి వెళ్లారు. వీటిపై కుంకుమ, పసుపు కూడా ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారమివ్వడంతో అక్కడకు చేరుకున్ అధికారులు ఆ పుర్రెలను తొలగించి చుట్టుపక్కలవారిని విచారించారు. అయితే ఎవరూ ఇళ్లబయట లేకపోవడంతో ఈ పని ఎవరు చేశారో తెలియరాలేదు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తామని వివరించారు. అయితే ఇటీవల కొంత మంది యువకులు మద్యం తాగి రోడ్లపై తిరుగుతుండడంతో స్థానికులు తమకు ఫిర్యాదు చేశారని, ఆ కోపంతో వారే ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement