బొగాబంద మాజీ సర్పంచ్‌కు గాయాలు

ABN , First Publish Date - 2020-09-27T11:04:38+05:30 IST

మందస మండలంలోని బొగాబంద మాజీ సర్పంచ్‌ సవర సాంబేరమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.పోలీసుల కథనం మేరకు...శనివారం బొగాబంద

బొగాబంద మాజీ సర్పంచ్‌కు గాయాలు

హరిపురం: మందస మండలంలోని బొగాబంద మాజీ సర్పంచ్‌ సవర సాంబేరమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.పోలీసుల కథనం మేరకు...శనివారం బొగాబంద పంచాయతీ పరిధిలోని కుడుమసాయి గ్రామానికి చెందిన సాంబేరమ్మ తన మేనల్లుడుకు ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసేందుకు పెద్దమడి జూనియర్‌ కళాశాలకు వెళ్లారు.


తిరుగు ప్రయాణంలో బొగాబంద వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలుకావడంతో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.ఈ ఘటనపై మందస పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-27T11:04:38+05:30 IST