చర్మ సంరక్షణ సీజన్‌కు తగ్గట్టుగా...
ABN , First Publish Date - 2020-10-22T06:15:03+05:30 IST
సీజన్‌తో పాటు చర్మసంరక్షణలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. వాతావరణంలో మార్పులు చర్మం మీద ప్రభావం చూపుతాయి. ఈ సీజన్లో అందాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలంటే...
సీజన్‌తో పాటు చర్మసంరక్షణలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. వాతావరణంలో మార్పులు చర్మం మీద ప్రభావం చూపుతాయి. ఈ సీజన్లో అందాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలంటే...
- ఒక టీస్పూన్ చొప్పున కాఫీ పొడి, కొబ్బరినూనె, సగం టీస్పూన్ బియ్యప్పిండి తీసుకొని ఫేస్‌ప్యాక్ తయారుచేసుకోవాలి. ఈ ఫ్యాక్‌ను ముఖం, మెడ చుట్టూ వేళ్లతో మర్దనా చేసినట్టు రాసుకోవాలి.
- పది నిమిషాల తరువాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్ మృతకణాలను తొలగించి, చర్మానికి తాజాదనాన్ని, బిగుతుగుణాన్ని ఇస్తుంది. కొబ్బరినూనెలోని ఫ్యాటీఆమ్లాలు చర్మానికి తేమను అందిస్తాయి.
- కాఫీపొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. బియ్యప్పిండి చర్మానికి గట్టిదనాన్ని ఇస్తుంది. వారం రోజులు ఇలాచేస్తే చర్మం కాంతిమంతంగా మారుతుంది.