కర్ణాటకలో వెల్లువెత్తిన వరదలు..16 మంది మృతి

ABN , First Publish Date - 2020-08-12T15:10:52+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 16 మంది మరణించగా,మరో నలుగురు గల్లంతయ్యారు....

కర్ణాటకలో వెల్లువెత్తిన వరదలు..16 మంది మృతి

మరో నలుగురి గల్లంతు

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల 16 మంది మరణించగా,మరో నలుగురు గల్లంతయ్యారు. వరదల వల్ల మల్నాడ్, కర్ణాటక తీరప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది. 12 జిల్లాలు వరదబారిన పడటంతో 3,244 మంది బాధితులను 108 సహాయ పునరావాస శిబిరాలకు తరలించారు. వరదల వల్ల 28 జంతువులు మరణించాయి. 85 గృహాలు వరదలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 3,080 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 33,477 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కొడగు ప్రాంతంలోని వరదనీటిలో పూజారి నారాయణ ఆచారి మృతదేహం లభించింది. బ్రహ్మగిరి వద్ద కొండచరియలు విరిగి పడి నలుగురు గల్లంతు అయ్యారు. ఉత్తర కన్నడ, బెల్గావీ జిల్లాల్లో వరద తగ్గుముఖం పట్టింది. 

Updated Date - 2020-08-12T15:10:52+05:30 IST