ఆరు జిల్లాలకు పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా

ABN , First Publish Date - 2022-04-22T15:42:42+05:30 IST

ఆరు జిల్లాల్లో రూ.2,700 కోట్లతో పైప్‌ లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేసే పథకం ప్రారంభించనున్నట్లు ఏజీ అండ్‌ పీ ప్రదామ్‌ సంస్థ ప్రాంతీయ అధ్యక్షుడు వెంకటేశన్‌ తెలిపారు. నగరంలో

ఆరు జిల్లాలకు పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా

వేలూరు(చెన్నై): ఆరు జిల్లాల్లో రూ.2,700 కోట్లతో పైప్‌ లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేసే పథకం ప్రారంభించనున్నట్లు ఏజీ అండ్‌ పీ ప్రదామ్‌ సంస్థ ప్రాంతీయ అధ్యక్షుడు వెంకటేశన్‌ తెలిపారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఇంధనశక్తి సరఫరాలో తమ సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో వేలూరు, రాణిపేట, తిరుపత్తూర్‌, రామనాథపురం, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లో పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫరా చేసేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించిందన్నారు. ఇందులో భాగంగా డిసెంబరు నెలాఖరులోగా 25 సీఎ్‌సజీ కేంద్రాలు ఏర్పాటుచేసి 31 వేల ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్‌ సరఫరా చేయనున్నామన్నారు. ఈ పథకంలో వాతావరణ కాలుష్యం తగ్గడంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుందని తెలిపారు. అలా పొందిన గ్యాస్‌కు రెండు నెలలకు ఒకసారి వినియోగదారులు డబ్బు చెల్లించాల్సి ఉందని వెంకటేశన్‌ తెలిపారు. సమావేశంలో సంస్థ సీనియర్‌ మేనేజర్‌ ప్రసాద్‌, జూనియర్‌ అసోసియేట్‌ హరికృష్ణన్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-04-22T15:42:42+05:30 IST