24 గంటల్లో ఆరు సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లు

ABN , First Publish Date - 2022-01-29T17:59:50+05:30 IST

24 గంటలలో ఆరు సెల్‌ ఫోన్‌ స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితులను వారు వినియోగిం చిన బైకే పట్టించింది. బంజారాహిల్స్‌, సింగాడి బస్తీలో

24 గంటల్లో ఆరు సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లు

48 గంటల్లో నిందితుల అరెస్టు.. ఫోన్లు స్వాధీనం

బైక్‌ వీల్‌ పట్టించింది


హైదరాబాద్‌ సిటీ: 24 గంటలలో   ఆరు సెల్‌ ఫోన్‌ స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితులను వారు వినియోగిం చిన బైకే పట్టించింది. బంజారాహిల్స్‌, సింగాడి బస్తీలో నివసించే ఖాజా పాషా ఇంటర్‌ చదువు తూ స్నేహితులు సబిల్‌, సొహైల్‌తో కలిసి గంజా యి, డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. మద్యం తాగు తూ బైక్‌పై దూసుకెళ్తూ స్థానికంగా హల్‌చల్‌ చేసేవాడు. తన ప్రత్యేకతను చాటుకోవాలని బైక్‌ వీల్‌ రిమ్ముకు తెల్ల రంగు వేసుకున్నాడు. స్నేహితులతో కలిసి ఇదే బైక్‌పై తిరుగుతూ 24 గంటల వ్యవధిలో ఆరు చోట సెల్‌ ఫోన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు.


అయితే, రంగంలోకి దిగిన పోలీసులు  సీసీ కెమెరాలు పరిశీలించగా, అన్ని చోట్లా ఒకే బైక్‌.. అదీ రిమ్ముకు తెల్లరంగు వేసినది కనిపించింది. దాని ఆధారంగా నగరంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తంగా చేశారు. ఫిర్యాదు అందిన 48 గంటల వ్యవధిలో నలుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు స్నాచింగ్‌ చేసిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరా లు వెల్లడించారు. ఖాజాపాష (19), షేక్‌ సోహైల్‌ (19) పెయింటర్లు, మహమ్మద్‌ సబీల్‌ (19) విద్యార్థి, పవన్‌ కుమార్‌(20) ఆఫీ్‌సబాయ్‌గా పని చేస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసలుగా మారి న వీరు ఈ నెల 24న రాత్రి నుంచి మరుసటి రోజు రాత్రి వరకు పలు చోట్లా 6 స్నాచింగ్‌లు చేశారు.  24న  నలుగురు నిందితులు బంజారాహిల్స్‌ సింగాడి కుంట ఆటోస్టాండ్‌ వద్ద మద్యం తాగారు. ఆ తర్వాత ఖాజా, సబీల్‌, పవన్‌లు రాత్రి 9గంటల ప్రాంతంలో టోలీచౌకీ బృందావన్‌ కాలనీ లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ లాక్కొని పరారయ్యారు.  షేక్‌పేట్‌ ప్రెసిడెంట్‌ గార్డెన్‌ వద్ద మరో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ చేశారు. అక్కడి నుంచి ఫిలింనగర్‌ చేరుకున్న నిందితులు బాటా షోరూం వద్ద మరో వ్యక్తి చేతిలోనుంచి ఫోన్‌ లాక్కొని పరారయ్యారు.


ఈ నెల 25 రాత్రి నిందితులు ఇన్‌కం టాక్స్‌ క్వార్టర్స్‌ వద్ద మరో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ చేశారు.  గోశాల ఎదురుగా ఇంకో వ్యక్తి ఫోన్‌ తస్కరించారు. అదే రోజు రాత్రి ఫిలింనగర్‌లో మరో సెల్‌ఫోన్‌ తస్కరించారు. ఇలా 24 గంటల వ్యవధిలో మొత్తం ఆరు సెల్‌ఫోన్లు స్నా చింగ్‌ కేసులు నమోదు కావడంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బైక్‌ ఆధారాలు, సీసీకెమెరాలు, సాంకేతికత సాయంతో పోలీసులు నిందితులందరినీ అరెస్ట్‌ చేశారు. ఈ నెల మొదటి వారంలో ఖాజాపాష, సబీల్‌, సొహైల్‌లు మెహిఫిల్‌ హోటల్‌ వద్ద ఓ సెల్‌ఫోన్‌ తస్కరించారు. రాయదుర్గంలోని షా గౌస్‌ హోటల్‌, దర్గా క్రాస్‌ రోడ్‌ వద్ద మరో సెల్‌ఫోన్‌ తస్కరించినట్లు కూడా  అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి మొత్తం చోరీకి గురైన 8 సెల్‌ఫోన్లను రికవరీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. 

Updated Date - 2022-01-29T17:59:50+05:30 IST