Abn logo
Jul 30 2021 @ 21:58PM

మెగా పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన

శ్మశాన వాటికను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

కెరమెరి, జూలై 30: మండలంలోని మెట్టపిప్పిరి గ్రామంలో ఏర్పాటు చేయనున్న మెగాపార్కు కోసం శుక్రవారం అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి స్థలపరిశీలన చేశారు. అనంతరం కెరమెరి, కోటారి, రింగన్‌ఘాట్‌, మోడి, మెట్టపిప్పిరి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. వారంరోజుల్లో పల్లె ప్రకృతివనాల పనులు పూర్తిచేయాలన్నారు. సర్పంచ్‌లు గుణవంత రావు, లక్ష్మి, బయ్యనబాయి, ఎంపీడీవో దత్తరాం, తహసీల్దార్‌ సమీర్‌అహ్మద్‌ఖాన్‌ పాల్గొన్నారు.

జైనూరు: మండలంలోని రాశిమెట్ట, దబోలి, పానాపటార్‌ తదితర గ్రామాల్లో అభివృద్ధి పనులను శుక్రవారం అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రాశిమెట్టలోని శ్మశానవాటిక, దబో లిలో పల్లెప్రగతిపనులను పరిశీలించారు. రాశిమె ట్టలో ఏర్పాటు చేయనున్న మెగాపార్కు స్థలంను పరిశీలించారు. సర్పంచ్‌లు మోతుబాయి, నాగోరావు, భీంరావు ఉన్నారు.

బెజ్జూరు:మండలంలోని లంబాడీగూడలో మెగా పార్కు ఏర్పాటుకు శుక్రవారం డీపీవో శ్రీకాంత్‌ స్థల పరిశీలనజరిపారు. గ్రామంలో ఏర్పాటుచేసిన శ్మశాన వాటిక, ఎరువుల తయారీకేంద్రాన్ని పరిశీలించారు.

పెంచికలపేట: మండలంలోని చెడ్వాయి గ్రామ సమీపంలోని పదెకరాల స్థలంలో మెగాపార్కు కోసం శుక్రవారం డీపీవో శ్రీకాంత్‌ స్థలపరిశీలన చేశారు.

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలోని పదిఎకరాల ప్రభుత్వస్థలాన్ని శుక్రవారం డీపీవోశ్రీకాంత్‌ పరిశీ లించారు. ప్రభుత్వం ప్రతిమండలంలో ఒక మెగాపా ర్కును రూ.40లక్షలతో ఏర్పాటు చేయనుందన్నారు.