దొంగ దొరికాడు

ABN , First Publish Date - 2020-12-06T05:03:27+05:30 IST

కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై శిరివెళ్ల మెట్ట వద్ద ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఇటీవల దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు శిరివెళ్ల సర్కిల్‌ సీఐ చంద్రబాబునాయుడు, ఎస్‌ఐ సూర్యమౌలి శనివారం తెలిపారు.

దొంగ దొరికాడు

  1. బ్యాంకులో చోరీ యత్నం చేసిన వ్యక్తి అరెస్టు 
  2. మూడు బైకుల స్వాధీనం 


శిరివెళ్ల, డిసెంబరు 5: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై శిరివెళ్ల మెట్ట వద్ద ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఇటీవల దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు శిరివెళ్ల సర్కిల్‌ సీఐ చంద్రబాబునాయుడు, ఎస్‌ఐ సూర్యమౌలి శనివారం తెలిపారు. ఉయ్యాలవాడ మండలం పెద్దయమ్మనూరు గ్రామానికి చెందిన తలసాని రాము తనకున్న ఆర్థిక సమస్యల నుంచి గట్టేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గత నెల 29న దీబగుంట్ల నుంచి బోయలకుంట్ల వెళ్లే రహదారిలో చెన్నూరు గ్రామ పంట పొలాల్లో ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి అదే రోజు రాత్రి దాదాపు 2.30 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంకులో చోరీకి ప్రయత్నించాడు. అనంతరం ఈ నెల 1వ తేదీన ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండులో ఓ బైక్‌ను దొంగిలించాడు. ఈ నెల 2వ తేదీన శిరివెళ్ల మెట్ట వద్ద ద్విచక్ర వాహనాన్ని దొంగిలించాడు. శనివారం ఉదయం జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నంద్యాల నుంచి ఆళ్లగడ్డ వైపు వెళ్తున్న తలసాని రామును అదుపులోకి బైకును స్వాధీనం తీసుకుని విచారించారు. బ్యాంకులో చోరీయత్నం చేసినట్లు గుర్తించారు. అలాగే మరో రెండు ద్విచక్ర వాహనాలను ఆళ్లగడ్డ ప్రభుత్వ గోడౌన్‌ వెనుక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హెడ్‌ కానిస్టేబుళ్లు సుబ్బయ్య, కృష్ణమూర్తి, శాఖమూరి కృష్ణ, శ్రీనివాసులు, సిబ్బంది అశోక్‌, కిరణ్‌, శేషన్న, రామమద్దిలేటి, నాగేష్‌, మద్దిలేటి, రామసుబ్బయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:03:27+05:30 IST