‘సిరి’ ఇప్పుడు మెసేజ్‌లు చదువుతుంది

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

ఐ ఫోన్లకు మరికొన్ని కొత్త ఫీచర్లను జతచేస్తోంది

‘సిరి’ ఇప్పుడు మెసేజ్‌లు చదువుతుంది

ఐ ఫోన్లకు మరికొన్ని కొత్త ఫీచర్లను జతచేస్తోంది యాపిల్‌.  ఇప్పుడు ఐఫోన్‌ యూజర్లకు వచ్చిన మెసేజ్‌లను ‘సిరి’ చదివి వినిపిస్తుంది. ఐఫోన్‌ 6ఎస్‌, ఆపైన ఫోన్లు ఉపయోగించే యూజర్లకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.   మెసేజ్‌ వినాలనుకునేవారు యాపిల్‌ ఇయర్‌ఫోన్స్‌ లేదా రెండు, మూడో జనరేషన్‌కు చెందిన ఎయిర్‌పాడ్స్‌, ఎయిర్‌పాడ్స్‌ ప్రొ, పవర్‌బీట్స్‌ ప్రొ తదితరాల్లో ఏదో ఉపయోగిస్తుండాలి. 


ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేయగానే ‘సిరి’ మొదట మెసేజ్‌ పంపిన వ్యక్తి పేరును చెప్పి, అందులోని సమాచారాన్ని చదువుతుంది. చిన్న మెసేజ్‌లకు మాత్రమే ఇది వరిస్తుంది.  మెసేజ్‌లు పెద్దగా ఉంటే మాత్రం కేవలం పంపినవారి పేరు మాత్రమే చదువుతుంది.  కొత్త అప్‌డేట్‌తో యాపిల్‌ కార్‌ప్లేతో కలిసి ఐఫోన్‌ మెసేజ్‌లను చదువుతుంది. ఫోన్‌ దూరంగా పెట్టి ఏదో పనిచేసుకుంటున్న వారికి లేదంటే డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్‌ బాగా ఉపయోగకరం. దీనికోసం


 యాపిల్‌ ఐఫోన్‌లో సెట్టింగ్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

 స్ర్కోల్‌డౌన్‌ చేసి సిరి అండ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ను టాప్‌ చేయాలి. 

 అనౌన్స్‌ నోటిఫికేషన్స్‌ను టాప్‌ చేయాలి.

 అనౌన్స్‌ నోటిఫికేషన్స్‌ కోసం టోగెల్‌ను టర్న్‌ ఆన్‌ చేయాలి. 

 ఇప్పుడు అదే పేజీపై హెడ్‌ఫోన్స్‌ కోసం టోగెల్‌ను టర్న్‌ఆన్‌ చేయాలి. 

వాయిస్‌ కమాండ్‌తో తిరుగు సమాధానాలు కూడా ఇవ్వవచ్చు. మెసేజ్‌ చదివిన తరవాత స్పందించేందుకు ‘సిరి’ అవకాశం ఇస్తుంది.  ‘హాయ్‌ సిరి’ అని చెప్పకుండానే సమాధానం చెప్పేయవచ్చు. అనౌన్స్‌ నోటిఫికేషన్స్‌  ఫీచర్‌తో ఇతర యాప్స్‌ నుంచి అందే సెన్సిటివ్‌ నోటిఫికేషన్స్‌, డైరెక్ట్‌ మెసేజ్‌లను కూడా సిరి చెబుతుంది. 


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST