ఓడిన వైక్యలం

ABN , First Publish Date - 2021-03-05T07:02:31+05:30 IST

జీవనోపాధికి వైకల్యం అడ్డురాదని

ఓడిన వైక్యలం
ఒంటి చేతితో షేర్‌ బ్యాండ్‌ కొడుతున్న సల్మాన్‌ షరీఫ్‌

ఒంటి చేత్తో బ్యాండ్‌ కొడుతూ శభాష్‌ అనిపించుకుంటున్న సల్మాన్‌

ముషీరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : జీవనోపాధికి వైకల్యం అడ్డురాదని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. విద్యుత్‌ షాక్‌ వల్ల ఒక చెయ్యి కోల్పోయినా ఆధైర్యపడకుండా ఒంటిచేత్తోనే బ్యాండు కొడుతూ ఉపాధి పొందుతున్నాడు. పార్సిగుట్టకు చెందిన సల్మాన్‌ షరీఫ్‌ (24) తల్లిదండ్రులు చిన్నప్పుడే మృతి చెందారు. బోయిన్‌పల్లిలోని అక్క వద్ద ఉంటున్నాడు. పదేళ్ల వయసులో సల్మాన్‌ షరీఫ్‌ భవనంపై పతంగు ఎగురవేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ఎడమ చెయ్యి కాలిపోయింది. వైద్యులు ఆ చెయ్యిని పూర్తిగా తొలగించారు. నాటి నుంచీ అక్క ఇంట్లోనే ఉండేవాడు. 15 సంవత్సరాల క్రితం పార్సిగుట్టకు వచ్చి బ్యాండు షాపులో చేరాడు. బ్యాండు కొట్టడం నేర్చుకున్నాడు. సమావేశాలు, శుభకార్యాలు, బారాత్‌లలో ఒంటి చేత్తోనే బ్యాండు కొడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సీజన్‌ లేనప్పుడు టాటా ఏసీ వాహనం నడుపుతూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. చెయ్యి లేదని ఏనాడూ  బాధపడలేదని, అందరిలాగే తానూ జీవిస్తున్నానని సల్మాన్‌షరీ్‌ఫ తెలిపారు. 

Updated Date - 2021-03-05T07:02:31+05:30 IST