పాటల కోటలు

ABN , First Publish Date - 2021-12-18T05:30:00+05:30 IST

కాస్త తీరిక దొరికితే చాలు. మెలోడీలు వింటూ గడిపేయాలనుకునేవారు కొందరు. ఏదైనా సందర్భం దొరికితే...

పాటల కోటలు

టారిఫ్‌ తక్కువ - ఆప్షన్స్‌ ఎక్కువ

కాస్త తీరిక దొరికితే చాలు. మెలోడీలు వింటూ గడిపేయాలనుకునేవారు కొందరు. ఏదైనా సందర్భం దొరికితే ఆటపాటలతో ఊగిపోవాలనుకుంటారు మరికొందరు. గానం వ్యక్తిని మైమరిపిస్తుంది, లాలిస్తుంది, ప్రశాంత చేకూరుస్తుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా, తమకు నచ్చే పాటలతో సేదతీరాలనుకుంటారు. అలాంటి మ్యూజిక్‌ను అందించే యాప్స్‌ మార్కెట్‌లో కుప్పలు తెప్పలు. వీటిలో ఫ్రీ, పెయిడ్‌ లాంటి రెండు రకాలు ఉన్నాయి.


 ఏ అడ్వర్టైజ్‌మెంట్‌ ఇబ్బందులు లేకుండా అలా వినేయాలి అనుకుంటే పెయిడ్‌ వర్షన్స్‌ బెటర్‌. పెయిడ్‌లో కూడా ఒక్కొక్కరిదీ ఒక్కో ధర. వీటిలో  పాపులర్‌ యాప్‌ ‘స్పూటిఫై’ లాంటి వాటిలో కొంత ఎక్కువ చార్జ్‌ ఉంటే, తక్కువ  డబ్బు వసూలు చేసే ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.   ఎక్కువ ఖర్చు  వద్దు అనుకునేవారు వీటికి వెళ్లవచ్చు.  


యూట్యూబ్‌ మ్యూజిక్‌

‘యూట్యూబ్‌ మ్యూజిక్‌’ సర్వీస్‌ చాలా తక్కువ ధరకే మంచి సంగీతాన్ని అందిస్తోంది. ఒక రకంగా ప్రపంచంలో అతి ఎక్కువ కలెక్షన్‌ ఉన్న మ్యూజిక్‌ యాప్‌గా దీనికి పేరుంది. యూజర్‌ అభిరుచికి అనుగుణమైన సూచనలు ఎప్పటికప్పుడు అందడం దీని ప్రత్యేకత. 

నెలకు రూ.99తో ఇది మొదలు అవుతుంది.  ఫ్యామిలీ ప్లాన్‌ కావాలంటే రూ.149, విద్యార్థుల కోసం రూ.59కే మ్యూజిక్‌ అందిస్తుంది. 


యాపిల్‌ మ్యూజిక్‌

ఐఫోన్‌ ఉన్న యూజర్లకు రూ.99కి మ్యూజిక్‌ అనేది మంచి ఆప్షన్‌. యూజర్లు లేటెస్ట్‌ ప్లేలిస్ట్‌ యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఇతర యాపిల్‌ సర్వీసులతో అనుసంధానం కూడా ఉంటుంది. ఇందులో ఫ్యామిలీ ప్లాన్‌ ఆప్షన్‌ కూడా ఉంది. ఇది 149 రూపాయలకు లభిస్తుంది. హోమ్‌పాడ్‌ మిని లేదా ఏదైనా సిరి లింక్‌డ్‌ సర్వీసులకు యాపిల్‌ మ్యూజిక్‌ సర్వీసులకు రూ.49 వాయిస్‌ ప్లాన్‌  కూడా ఉంది. 


అమెజాన్‌ ప్రైమ్‌ మ్యూజిక్‌

అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్ర్కిప్షన్‌తో ఇది కూడా కలిసి వస్తుంది. రూ.179 చెల్లిస్తే చాలు, ప్రకటనల ఇబ్బంది లేకుండా హాయిగా పాటలు వినవచ్చు. హైక్వాలిటీ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌, పాడ్‌కాస్ట్‌, ప్రైమ్‌ వీడియోలు, అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసులు కలగలిసి ఉంటాయి. వార్షిక ప్లాన్‌ రూ.1499 కాగా నగదుతో లభించే సర్వీసుల్లో ఇదే మంచిది అని చెప్పవచ్చు. 


‘జియో సావన్‌’

అందుబాటు సబ్‌స్ర్కిప్షన్‌ ఉన్న యాప్‌లో జియో సావన్‌ ఒకటి. ఇది ఉచితంగా కూడా లభిస్తుంది. అయితే ప్రకటనలు ఉండడంతోపాటు, యూజర్లు తాము కావాలనుకున్న పాటలను డౌన్‌లోడ్‌ చేసుకోలేరు.   రూ.99 చెల్లిస్తే  యాడ్స్‌ లేకుండా పాటలు వినడంతోపాటు, హెచ్‌డీ పాటలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనికి కూపన్‌ బేస్డ్‌ బెనిఫిట్స్‌ కూడా ఉంటాయి. వార్షిక ప్లాన్‌ రూ.399. ప్రస్తుతం లిమిటెడ్‌ ఆఫర్‌ ఒకటి ఉంది. కేవలం రూపాయి చెల్లించి ఈ డిసెంబర్‌ 31లోపు మంత్లీ ప్లాన్‌ పొందవచ్చు.


గానా

మూడు నెలల చందా రూ.149తో ఇది ఆరంభమవుతుంది. వార్షిక ప్లాన్‌ రూ.399. ఈ రేట్లకే ప్రకటనలు లేని పాటలకు తోడు వీడియోలు ఈ యాప్‌లో లభ్యమవుతాయి. 

Updated Date - 2021-12-18T05:30:00+05:30 IST