పారిశుధ్యానికి ప్రథమ ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-08-20T05:09:34+05:30 IST

సింగరేణి కార్మిక ప్రాంతాల్లో పారిశుధ్య పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌. నర్సింహారావు కోరారు.

పారిశుధ్యానికి ప్రథమ ప్రాధాన్యం
చెత్త సేకరణ వాహనాలను ప్రారంభిస్తున్న జీఎం నర్సింహారావు

కొత్తగూడెం జీఎం నర్సింహారావు

చెత్త సేకరణ వాహనాల ప్రారంభం

రుద్రంపూర్‌, (సింగరేణి) ఆగస్టు 19 : సింగరేణి కార్మిక ప్రాంతాల్లో పారిశుధ్య పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని కొత్తగూడెం ఏరియా జనరల్‌ మేనేజర్‌ సీహెచ్‌. నర్సింహారావు కోరారు. శుక్రవారం కార్మిక ప్రాం తాల్లో చెత్త సేకరించే ఆరు వాహనాలను సంబంధిత ఏరియాలకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రూ.33 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఆరు వాహనాలను చెతసేకరణకు వినియోగించాలని కోరారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ఏరియా ఉపాధ్యక్షులు రజాక్‌, ఎస్‌వోటు జీఎం రమేష్‌, జీకేఓసీ మేనేజర్‌ కరుణాకర్‌, అధికారులు రవీందర్‌, సత్యనారాయణ, మధుకర్‌, రమణారెడ్డి, నాయకులు కాపు కృష్ణ, నాగరాజు, శేఖర్‌బాబు, సర్పంచ్‌, ఎంపీటీసీలు నాగమణి, పరమేష్‌, గుమ్మడి సాగర్‌, కళావతి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T05:09:34+05:30 IST