సింగపూర్ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయం

ABN , First Publish Date - 2020-07-11T12:28:32+05:30 IST

సింగపూర్ దేశంలో శుక్రవారం జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) మళ్లీ విజయం సాధించింది.....

సింగపూర్ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయం

సింగపూర్ : సింగపూర్ దేశంలో శుక్రవారం జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) మళ్లీ విజయం సాధించింది. 1965 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పీఏపీ సింగపూర్ దేశంలోని 93 పార్లమెంటు స్థానాల్లో 83 సీట్లను గెల్చుకొని 61.2శాతం ఓట్లు సాధించింది.  2015వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అధికార పీఏపీకి ఓట్ల శాతం 70 శాతానికి తగ్గింది. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీకి 10 సీట్లు దక్కాయి.కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సింగపూర్ దేశంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు ముఖానికి మాస్క్, చేతులకు గ్లోజులు ధరించి వచ్చి సామాజిక దూరం పాటిస్తూ ఓటింగులో పాల్గొన్నారు. అధికార పీఏపీ సింగపూర్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రస్థుత ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్ మరోసారి పదవిని చేపట్టనున్నారు. సింగపూర్ వ్యవస్థాపకుడు, దీర్ఘకాల ప్రధానమంత్రి అయిన లీ కాన్ యూ అనంతరం 2004లో లీ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. సింగపూర్ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పార్టీ జెండాలు చేతబట్టుకొని విజయోత్సవం జరుపుకున్నారు.

Updated Date - 2020-07-11T12:28:32+05:30 IST