సింగపూర్ లో కొత్తగా 642 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-05-23T23:01:24+05:30 IST
సింగపూర్ లో కొత్తగా 642 కరోనా కేసులు నమోదు
చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ యావత్తు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. సింగపూర్ దేశాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సింగపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకు కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం సింగపూర్ లో కొత్తగా 642 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. సింగపూర్ దేశంలో మొత్తం 31,068 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.