ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ : ఎంపీ ఉత్తమ్‌

ABN , First Publish Date - 2022-05-22T05:21:30+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ : ఎంపీ ఉత్తమ్‌
చింతలపాలెం మండలం దొండపాడులో మాట్లాడుతున్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు , ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

చింతలపాలెం, మే 21: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ  చేస్తామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులతో పాటు కౌలురైతులకు ఏడాదికి రూ.15 వేల పంటసాయాన్ని అందజేస్తామన్నారు. భూమి లేని వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున బ్యాంక్‌లో జమచేస్తామన్నారు. మండలంలోని సర్వే నెంబరు 318లో వందల ఎకరాలు భూకబ్జాకి గురైనా కలెక్టర్‌, ఎస్పీ, ఆర్డీవో ఎందుకు స్పందించడం లేదన్నారు. కేసీఆర్‌ నుంచి సైదిరెడ్డి వరకు ఇసుక, భూమి, వైన్స్‌ వంటి వాటి నుంచి దొరికినంత దోచుకుంటున్నారని ఆరోపించారు. భూకబ్జాల కోసమే ఆర్డీవో కార్యాలయాన్ని హుజూర్‌నగర్‌లో ఏర్పాటుచేశారని ఎద్దేవా చేశారు. భూకబ్జాలకు సహకరించనందుకే ఎస్‌ఐలపై బదిలీ వేటు వేశారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడి త్వరలో వారికి బుద్ధి చెబుతారన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బుగ్గమాదారం, వజినేపల్లి, నెమలిపురి, యర్రకుంటతండా, కొత్తగూడెంతండా, చింతలపాలెం, మల్కాపురం, దొండపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. 30 రోజుల్లో 250 గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ షేక్‌ షాహెదాబేగం టీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇంద్రారెడ్డి, నరేందర్‌రెడ్డి, సీతారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, హనిమిరెడ్డి, సైదులు పాల్గొన్నారు.


రైతుల జీవితాల్లో వెలుగులు నింపేది కాంగ్రెసే

పెన్‌పహాడ్‌: రైతుల జీవితాల్లో వెలుగులు నింపేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే అని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. దూప హాడ్‌లో రైతు రచ్చబండ కార్యక్రమంలో ఆయన ప్రారంభించి, మాట్లాడారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలు, రైతు వ్యతిరేక విధానాలు అభిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, జిల్లా మహిళ అధ్యక్షురాలు అనురాధ, మండల అధ్యక్షుడు తూములు సురే్‌షరావు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, నాయకులు తూములు భుజంగరావు, కొప్పుల వేణారెడ్డి, వీరన్ననాయక్‌, పిన్నాని కోటేశ్వర్‌రావు, రామినేని పుష్పవతి, కోన వెంకన్న, చెరుకు ఉపేందర్‌, అడ్తి కేశవులు, పత్తిపాక వేణుధర్‌, భూక్య శివనాయక్‌, భూక్య సందీప్‌ రాథోడ్‌, పిన్నాని జనార్థన్‌, దొంగరి వెంకన్న, సైదులు, సునీల్‌, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, కోటయ్య, వీరయ్య, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:21:30+05:30 IST