Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అధికారులకు సిద్ధిపేట కలెక్టర్ వార్నింగ్

సిద్ధిపేట జిల్లా: అగ్రికల్చర్ మీటింగ్‌లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ యాసంగిలో వరి విత్తనాలు అమ్మకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ఎవరైన వరి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే ఒక్కొక్కరిని చెండాడుతా, వేటాడుతా.. అంటూ హెచ్చరించారు. వరి విత్తనాలు అమ్మె హక్కు ఎవరికీ లేదన్నారు.


ఈ యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, విత్తన సరఫరా చేసే డీలర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement