టైం టేకింగ్‌గా అర్థమెటిక్‌ ప్రశ్నలు.. ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్‌ ప్రిలిమ్స్‌ అనాలసిస్‌

ABN , First Publish Date - 2022-08-09T21:05:49+05:30 IST

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(Telangana Police Recruitment Board) ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐ(SI) ఆఫ్‌ పోలీస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష గతంలో నిర్వహించిన పరీక్షల్లో కంటే

టైం టేకింగ్‌గా అర్థమెటిక్‌ ప్రశ్నలు.. ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్‌ ప్రిలిమ్స్‌ అనాలసిస్‌

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(Telangana Police Recruitment Board) ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐ(SI) ఆఫ్‌ పోలీస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష గతంలో నిర్వహించిన పరీక్షల్లో కంటే అర్థమెంటిక్‌(Arithmetic) విభాగం టైమ్‌ టేకింగ్‌గా ఉంది. అయితే రీజనింగ్‌ ప్రశ్నలు మాత్రం సులభంగా ఉన్నాయని పోలీసు పరీక్షల నిపుణులు శీలం దేవేందర్‌రెడ్డి విశ్లేషించారు.


  • అర్థమెటిక్‌ ప్రశ్నలు మంచి టైమ్‌ టేకింగ్‌గా ఉండటం వల్ల అభ్యర్థులు కొంత గాబరా పడాల్సి వచ్చింది.
  • రీజనింగ్‌ ప్రశ్నలు సులభంగా ఉండటం వల్ల చాలావరకు 20-25 మార్కులు పొందగలుగుతున్నారు.
  • జనరల్‌ స్టడీస్‌ విషయానికొస్తే ఎప్పటిలాగే ఇండి యన్‌ హిస్టరీ, జాగ్రఫీ, తెలంగాణ చరిత్ర, ఫిజిక్స్‌పై దృష్టి సారించారు. ప్రశ్నలు కూడా డైరెక్ట్‌గా ఉండటం వల్ల అభ్యర్థులకు కొంత ఊరట లభించినట్లయింది.
  • పాలిటీ, కెమిస్ర్టీ, బయాలజీల్లో అతి తక్కువ ప్రశ్నలు అడిగినా మంచి కఠినత్వం కలిగినవే ఉన్నాయి.
  • అభ్యర్థులకు మొదటినుంచి ఉన్న ఒకే ఒక భయం నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండటం వల్ల తెలిసిన సమాధానానికి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి కానీ బబ్లింగ్‌ చేయలేని పరిస్థితి నెలకొంది.
  • ప్రశ్నల కఠినత్వం సాధారణ స్థాయిలోనే ఉంది.
  • మొత్తానికి మంచిగా కష్టపడి ప్రిపేరైన అభ్యర్థి సులభంగా క్వాలిఫై అయ్యేవిధంగానే ప్రశ్నపత్రం ఉంది.
  • చివరి నోటిఫికేషన్‌లో లాగా ఈసారి విమర్శలకు తావిచ్చే ప్రశ్నలు, సందిగ్ధ సమాధానాలు గల ప్రశ్నలు లేకుండా పేపర్‌ సెట్టింగ్‌ చాలా బాగా చేశారు.

తెలంగాణ హిస్టరీ 

ఉద్యమంలోని కొన్ని ప్రశ్నలు

1. హైదరాబాద్‌ ప్రొటెక్షన్‌ సమితి స్థాపకుడు

- రామాచారి

2. ఢిల్లీలో ‘పెద్ద మనుషుల ఒడంబడిక’పై ఏరోజు సంతకం చేశారు?

- 1956, ఫిబ్రవరి 20

3. తెలంగాణ ఉద్యమ అంతిమదశ ఉద్యమంలో 2001 ఏప్రిల్‌ 27న చారిత్రక ప్రాధాన్యం ఏది?

- తెలంగాణ రాష్ట్రసమితి స్థాపన

4. ‘నిజాం సబ్జెక్ట్‌ లీగ్‌’ను హైదరాబాద్‌ రాజ్యంలోని కొందరు విద్యావంతులైన మేథావులు ఏ సంవత్సరంలో 

స్థాపించారు?

- 1934

5. 2001 జూన్‌లో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమిషన్‌ను గుర్తించండి?

- జే.ఎం.గిర్‌గ్లానీ కమిషన్‌

6. ఉప ముఖ్యమంత్రి పదవి ‘చేతికి ఆరో వేలు’గా ఎవరు అభివర్ణించారు?

- నీలం సంజీవరెడ్డి







Updated Date - 2022-08-09T21:05:49+05:30 IST