మానవత్వం చాటుకున్న ఎస్‌ఐ

ABN , First Publish Date - 2021-05-16T06:10:21+05:30 IST

కరోనాతో మృతి చెందిన మహిళ మృతదేహాన్ని తన సొంతఖర్చు ఆటోలో ఆమె స్వగ్రామానికి తరలించి స్థానిక ఎస్‌ఐ ఆంజనేయులు మా నవత్వాన్ని చాటుకు న్నారు.

మానవత్వం చాటుకున్న ఎస్‌ఐ
మహిళ మృతదేహాన్ని ఆటోలో తరలిస్తున్న ఎస్‌ఐ ఆంజనేయులు


రాప్తాడు, మే 15: కరోనాతో మృతి చెందిన మహిళ మృతదేహాన్ని తన సొంతఖర్చు ఆటోలో ఆమె స్వగ్రామానికి తరలించి స్థానిక ఎస్‌ఐ ఆంజనేయులు మా నవత్వాన్ని చాటుకు న్నారు. వివరాలు ఇలా... మండలంలోని బండమీదపల్లికి చెంది న ఓ మహిళ (55) శనివారం కరోనాతో మృతి చెందింది. ఆమె శనివారం ఉదయం శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. కరోనా పరీక్షలు చేయించడంతో పాజిటివ్‌ వచ్చింది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో అంబులెన్సుకు ఫోన చేశారు. అంబులెన్సు ఆసుపత్రికి రాకముందే ఆమె చనిపోయింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. సమాచారం తెలుసుకున్న రాప్తాడు ఎస్‌ఐ ఆంజనేయులు వెంటనే అక్కడికి వచ్చి మానవతాదృక్పతంతో స్పందించారు. లగేజీ ఆటోను బాడుగకు పిలిపించి మృత దేహాన్ని బండమీదపల్లి కి చేర్పించారు. మానవతా దృక్పతంతో ఎస్‌ఐ సహాయం చేడంతో బాధితులు ఎస్‌ఐకి అభినందనలు తెలిపారు. 


Updated Date - 2021-05-16T06:10:21+05:30 IST