నాచగిరి ఆలయంలో శ్రావణ శోభ

ABN , First Publish Date - 2021-08-15T04:40:58+05:30 IST

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రావణ మాసం సందర్భంగా సందడి నెలకొంది.

నాచగిరి ఆలయంలో శ్రావణ శోభ
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణం

వర్గల్‌, అగస్టు 14: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రావణ మాసం సందర్భంగా సందడి నెలకొంది. శ్రావణ మాస పర్వదినాన్నఇ పురస్కరించుకుని శనివారం క్షేత్రంలో స్వామివారికి నిత్యకల్యాణం, నిజాభిషేకాలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి వేద పండితుల వేద మంత్రోశ్ఛరణలతో విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. శనివారం స్వామివారికి విశేషమైన రోజు కావడంతో ఆలయంలో ఆర్జిత సేవల్లో భాగంగా 10 నిత్యకల్యాణాలు, 15 నిజాభిషేకాలు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే 41 మంది దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ శభ్నవీసు హన్మంతరావు, సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్‌రెడ్డి తెలిపారు.


 

Updated Date - 2021-08-15T04:40:58+05:30 IST