తూర్పున జల్లులు.. పశ్చిమాన ఎండలు

ABN , First Publish Date - 2022-09-27T05:14:41+05:30 IST

జిల్లాలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అధికంగానే ఉంది. అనంతరం ఒక్కసారిగా మార్పు వచ్చి సాయంత్రానికి జల్లులు పడ్డాయి. తిరిగి సోమవారం పగటి పూట కూడా జిల్లాలోని తూర్పుప్రాంతంలో జల్లులు కురిశాయి. పశ్చిమప్రాంతంలో యథావిధిగా ఎండల తీవ్రత కొనసాగింది. చాలా ప్రాంతాల్లో 37 నుంచి 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తూర్పున జల్లులు..   పశ్చిమాన ఎండలు
ఒంగోలులో కురుస్తున్న వర్షం

జిల్లాలో విభిన్న వాతావరణం

ఒంగోలు సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అధికంగానే ఉంది. అనంతరం ఒక్కసారిగా మార్పు వచ్చి సాయంత్రానికి జల్లులు పడ్డాయి. తిరిగి సోమవారం పగటి పూట కూడా జిల్లాలోని తూర్పుప్రాంతంలో జల్లులు కురిశాయి. పశ్చిమప్రాంతంలో యథావిధిగా ఎండల తీవ్రత  కొనసాగింది. చాలా ప్రాంతాల్లో 37 నుంచి 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మద్యాహ్నం మూడు గంటల సమయంలో రాష్ట్రంలో అత్యధికంగా హనుమంతునిపాడు మండలంలో 38.90డిగ్రీల ఎండ కాచింది. సీఎస్‌పురం మండలంలో 38.79, కురిచేడులో 37.93, త్రిపురాంతకంలో 36.78, మార్కాపురంలో 36.29, దొనకొండలో 35.90, పామూరులో 35.47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవన్నీ పశ్చిమంలోనివే కాగా మరికొన్ని ఆప్రాంత మండలాల్లో ఇలాగే ఎండల తీవ్రత  కొనసాగింది. అదేసమయంలో తూర్పుప్రాంతంలో వాతావరణం చల్లబడటంతోపాటు పలుచోట్ల వర్షపు జల్లులు  కురిశాయి. సోమవారం పగటిపూట సింగరాయకొండ మండలంలో 39.50 మి.మీ వర్షపాతం నమోదైంది. తాజా వర్షాలు ప్రస్తుతం పొలంలో బెట్టకు వస్తున్న పత్తి, కంది, మొక్కజొన్న, మిర్చి, ఆముదం పంటలకు ఉపకరించనున్నాయి. 

 9.8మి.మీ సగటు వర్షపాతం 

ఒంగోలు (కలెక్టరేట్‌) : జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఒక మోస్తరు వర్షం కురిసింది. సోమవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో 9.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కొండపి మండలంలో అత్యధికంగా 52.4మి.మీ కురిసింది. వెలిగండ్ల మండలంలో 36.2మి.మీ, పొన్నలూరులో 35.2, కంభంలో 34.6, బేస్తవారపేటలో 27.4, టంగుటూరులో 27.0, ఒంగోలులో 25.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జరుగుమల్లి మండలంలో 21.8మి.మీ, దర్శిలో 21.8, సీఎస్‌పురంలో 16.2, హనుమంతునిపాడులో 16.0, కొమరోలులో 13.0, పి.సి.పల్లిలో 10.4 మి.మీ వర్షం పడింది. పలు ఇతర మండలాల్లో 1.2 నుంచి 9.0మి.మీ  వర్షపాతం నమోదైంది. 



Updated Date - 2022-09-27T05:14:41+05:30 IST