సర్పంచ్‌లు, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు

ABN , First Publish Date - 2021-06-22T04:32:26+05:30 IST

సంగారెడ్డి జిల్లాలోని పలు సర్పంచులు, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు సోమవారం జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

సర్పంచ్‌లు, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు

సంగారెడ్డిటౌన్‌, జూన్‌ 21:  సంగారెడ్డి జిల్లాలోని పలు సర్పంచులు, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు సోమవారం జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కొండాపూర్‌, కంది, హత్నూర మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా మురుగుకాలువలు  చాలా రోజులుగా శుభ్రం చేయడం లేదని, సెగ్రిగేషన్‌ షెడ్లను ఉపయోగించడం లేదని, వర్మి కంపోస్టు తయారు చేయడం లేదని, నర్సరీలలో మొక్కలు సరిగా పెంచడం లేదని గుర్తించిన పంచాయతీ అధికారి సురే్‌షమోహన్‌ ఆయా గ్రామాల సర్పంచులు, సీనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశాల మేరకు కంది మండలంలోని వడ్డెనగూడ తాండ సర్పంచ్‌ బానోతు మానిబాయి, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి అరవింద్‌, తునికిళ్ల తాండ సర్పంచ్‌ కల్పన, పంచాయతీ కార్యదర్శి వివేక్‌గౌడ్‌, ఎర్దనూర్‌ తాండ సర్పంచ్‌ నైనావత్‌ రాందాస్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌ కుమార్‌, బేగంపేట సర్పంచ్‌ రాజేందర్‌, ఔట్‌సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శి అంబాసింగ్‌, చేర్యాల సర్పంచ్‌ శ్రవణ్‌కుమార్‌, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి వందన, బ్యాతోల్‌ సర్పంచ్‌ శిరీష, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి శ్రావణితో పాటు కొండాపూర్‌ మండలం మారేపల్లి సర్పంచ్‌ బండ్ల వెంకటేశం, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి రాము, హత్నూర మండలం తుర్కల ఖానాపూర్‌ పంచాయతీ కార్యదర్శి రఘు, గుండ్ల మాచనూర్‌ పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విధులపై నిర్లక్ష్యం వహించే సర్పంచులు, పంచాయతీకార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీపీవోను కలెక్టర్‌ హెచ్చరించారు.

Updated Date - 2021-06-22T04:32:26+05:30 IST