ఎస్సైలు నిబద్ధతతో పనిచేయాలి

ABN , First Publish Date - 2020-10-31T07:58:37+05:30 IST

ఎస్సైలు నిబద్ధతతో పనిచేసి, పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విఽధుల్లో చేరిన

ఎస్సైలు నిబద్ధతతో పనిచేయాలి

పోలీస్‌ శాఖకు మంచిపేరు తేవాలి

శిక్షణా ఎస్సైలతో సమావేశమైన సీపీ సజ్జనార్‌


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 30(ఆంధ్రజ్యోతి): ఎస్సైలు నిబద్ధతతో పనిచేసి, పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకొని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధుల్లో చేరిన ప్రొబెషనరీ ఎస్సైలతో సీపీ సజ్జనార్‌ శుక్రవారం సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్సైలు చాలా కీలక భూమిక పోషిస్తారన్నారు. ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఎస్సైలతోనే ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడి, స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు దారులతో ఓపికతో వ్యవహరించాలాన్నరు.


మీకోసం మేమున్నామనే భరోసా అందించాలన్నారు. మొత్తం 90మంది సివిల్‌, ఏఆర్‌ ఎస్సైలకు 5వారాల పాటు శిక్షణ ఉంటుందన్నారు. 90 మందిలో సివిల్స్‌-66 (పురుషులు-47, మహిళలు-19), ఏఆర్‌-24 (పురుషులు-21, మహిళలు-3)లు ఉన్నారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ, అంకితభావంతో పాటు.. బంధుప్రీతి లేకుండా పనిచేయాలన్నారు. పోలీ్‌సశాఖలోని వివిధ విభాగాలు, వాటి పనితీరు గురించి సీపీ వివరించారు. కార్యక్రమంలో క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, అడిషనల్‌ డీసీపీ మాణిక్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T07:58:37+05:30 IST