ప్రసూతి మరణాలు లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2021-02-26T05:50:42+05:30 IST

ప్రసూతి మరణాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నిర్ణీత సమయానికి వైద్య సేవలు పందే విధంగా గర్భిణులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రసూతి మరణాల పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రసూతి మరణాలు లేకుండా చూడాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌

ఆదిలాబాద్‌అర్బన్‌, ఫిబ్రవరి 25: ప్రసూతి మరణాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నిర్ణీత సమయానికి వైద్య సేవలు పందే విధంగా గర్భిణులకు అవగాహన కల్పించాలని  కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రసూతి మరణాల పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రసూతి మరణాల నిరోధానికి వైద్య, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల సిబ్బంది పటిష్ఠమైన చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణీ సమయంలో పౌష్టిక ఆహారం అందించడం, సమయానుకూలంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం భుజించడం వంటి సలహాలు అందిస్తూ కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. ప్రసూతి సమయంలో గర్భవతుల వెంట ఆశా కార్యకర్త, ఏఎన్‌ ఎంలు తప్పని సరిగా రిఫర్‌ చేసిన ఆసుపత్రికి వెళ్లాలని తెలి పారు. ప్రతి రోజూ ఆశాకర్యకర్తలు గర్భవతులను పరిక్షించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నరేందర్‌రాథోడ్‌ మాట్లాడుతూ ఉట్నూర్‌ కమిటీ హెల్త్‌ సెంటర్‌లో గైనకాలజిస్టులు విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మనోహార్‌, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి .డా.సాధన,ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. నవ్య, రిమ్స్‌ డైరెక్టర్‌ డా.బలరాంభానోత్‌, డా.పద్మిని, డా.సుష్మ, జిల్లా సంక్షేమ అదికారి మిల్క, మెడికల్‌ ఆఫీసర్లు, ఆశాకర్యకర్తలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T05:50:42+05:30 IST