కార్మికులకు అండగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-11T06:59:03+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న కార్మికుల కుటుంబాలను కేంద్రప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని భరోసా కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.

కార్మికులకు అండగా ఉండాలి
బీబీనగర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ నాయకులు

జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

 బీబీనగర్‌, జూన్‌ 10: లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న కార్మికుల కుటుంబాలను కేంద్రప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుని భరోసా కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా  బీబీనగర్‌లోని  పంచాయతీ కార్యాలయం ఎదుట సీఐ టీయూ నాయకులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లా డారు.  కరోనాను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమైనందునే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన  డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బండారు శ్రీరాములు, గాడి శ్రీనివాస్‌, దేవేందర్‌రెడ్డి, ఈశ్వర్‌, యాదమ్మ, కృష్ణ, కిరణ్‌ కుమార్‌, యాదగిరి, మల్లేశం పాల్గొన్నారు.


Updated Date - 2021-06-11T06:59:03+05:30 IST