మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-11-09T05:06:05+05:30 IST

ప్రజావాణి కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా నిర్వ హించాలని ఎక్సైజ్‌, క్రీ డలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా నిర్వహించాలి
ప్రజావాణిలో ప్రజల సమస్యను వింటున్న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

 - ఫిర్యాదుల పరిష్కారంపై 

      ప్రత్యేక దృష్టి పెట్టాలి

 - ప్రజావాణిలో ఎక్సైజ్‌ శాఖ 

    మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌ నగర్‌ ( కలెక్టరేట్‌ ), నవంబరు 8: ప్రజావాణి కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా నిర్వ హించాలని ఎక్సైజ్‌, క్రీ డలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం మహబూ బ్‌ నగర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని  రెవెన్యూ సమావేశ మంది రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మం త్రి హాజరై ప్రజల వద్దనుంచి ఫిర్యాదులను స్వీకరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారని, ముఖ్యంగా ఆయా పథకాల అమ లులో జిల్లాను ముందుంజేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ప్రజావాణి కా ర్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఒక వేళ ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ఫిర్యాది దారుకు స్పష్టంగా తెలియజేయాలని, సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని చెప్పారు. ఏవైన సాంకేతిక సమస్యలు ఉంటే సం బంధిత అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. అధికారులు ఒక సమస్యను  బాధ్యతగా తీసుకొని పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్‌కు సంబంధించిన సీట్లను భర్తీచేయడంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు. అదేవిధంగా హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు భోజనం, బోధన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, హాస్టల్‌ సీట్లు ఖాళీ లేకుండా చూడాలని, సీటు దొరకలేదని ఏఒక్క విద్యార్థి వెనక్కి పోరాదని చెప్పారు. ప్రజావాణిలో మహిళలు, సీనియర్‌ సిటిజన్లకు మొదటి ప్రాధాన్యత నివ్వాలని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మండల అధికారులతో కూడా మంత్రి మాట్లాడుతూ సూచనలు, సలహాలు ఇచ్చారు.  సమావేశంలో  కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, స్థానిక సం స్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, అధికారులు పాల్గొన్నారు. 

ఏఎన్‌ఎంలు సేవాభావంతో పనిచేయాలి

   మహబూబ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి):  ఏఎన్‌ఎంలు సేవాభావంతో పని చేయాలని, తమకు ప్రభుత్వం అప్పగించిన విధులను క్ర మశిక్షణతో నిర్వహించి మంచిపేరు తెచ్చుకోవాలని ఎక్సైజ్‌, పర్యా టకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. ఇటీవల జిల్లాలో వైద్య,ఆరోగ్యశాఖ ద్వారా నూతనంగా నియమితులైన 24 మంది ఏఎన్‌ఎంలు, ఇద్దరు ల్యాబ్‌టెక్నీషియన్లు, ఒక ఫార్మాసిస్టుకు సోమ వారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్ర మంలో  కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణ   తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T05:06:05+05:30 IST