పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-05-21T04:29:28+05:30 IST

జిల్లా వ్యాప్తంగా జూన్‌ 3 నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ హరిచందన ఆదేశించారు.

పకడ్బందీగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిచందన

- 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం 

- కలెక్టర్‌ హరిచందన

- అధికారులతో సమీక్ష


నారాయణపేట టౌన్‌, మే 20: జిల్లా వ్యాప్తంగా జూన్‌ 3 నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ హరిచందన ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణపై అధికారుల తో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి 5వ విడత కార్యక్రమాలు జూన్‌ 3నుంచి 18వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.  మండలాలకు ఇచ్చిన టార్గెట్‌లను పూర్తి చేయాలని   అధికారులను ఆదేశించారు. ప్రతీ గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామని గ్రామ అధ్యక్షులుగా సర్పంచ్‌ ఉంటారని, సభ్యులుగా ఎంపీటీసీ, వార్డు స భ్యులు, కార్యదర్శి, విద్యుత్‌ లైన్‌మెన్‌, మిషన్‌ భగీరథ టెక్నిషియన్‌ ఉంటారన్నారు. మండల స్థాయిలో అయితే మండల స్పెషల్‌ ఆఫీసర్‌ ఉంటారని, వీరు పక్షం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు ముం దుగా సూచించాలన్నారు. గ్రామ, మండల, మునిసి పాలిటీలో పర్యటించి పనులను గుర్తించాలని, రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలని, అవసరమున్న చోట ట్రీ గార్డులను ఏర్పాటుచేసి మొక్కలను సంరక్షిం చా లని, జాతీయ రహదారి వెంట రెండు వరుసల్లో మొ క్కలు, ఒక వరుసలో పూల మొక్కలు నాటాలన్నారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలను వాడుకల్లోకి తీసుకురావాలని అక్కడ వసతులు పరిశీలించి నివేది కలు ఇవ్వాలన్నారు.  క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కు స్థలాలను పరిశీలించాలని ఆదేశించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వలు ఉండకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు తీసుకో వాలన్నారు. చెత్తసేకరణ నిరంతరంగా చేపట్టి వాటిని డంపింగ్‌ యార్డుకు తరలించి తడిపొడి చెత్తను వేరు చేయాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా హరిత హారం ప్రణాళికలు రూపొందించాలని బృహత్‌ పల్లె ప్రక ృతి వనాలకు అనువైన స్థలాలను గుర్తించాలని , ఇదీవరకు ఏర్పాటు చేసిన ప్రకృతి వనాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటాలన్నారు. నీటి ట్యాంకులను శుభ్ర పరచాలని, పంచాయతీల ద్వారా పాఠశాలలో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేయాలని, వైకుంఠ ధా మాలలో, డంపింగ్‌ యార్డులలో మిషన్‌ భగీరథ ద్వా రా నీటి సదుపాయం కల్పించాలన్నారు. సమావేశం లో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, పద్మజా రాణి, డీపీవో మురళి, డీఈవో లియాఖత్‌ అలీ,  అధికారులు సుధాకర్‌, వీనవాణి, సిద్రామప్ప, కృష్ణమచారి, వేణుగోపాల్‌, హథిరామ్‌, శివప్రసాద్‌, నాగులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.

  ధాన్యాన్ని తీసుకోవాలి

 జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన  ధాన్యాన్ని మిల్లర్లు కాదనకుండా తీసుకోవాలని  క లెక్టర్‌ హరిచందన మిల్లర్లకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో  మిల్లర్ల సంఘం సభ్యులతో కలెక్టర్‌ స మావేశమయ్యారు. అకాల వర్షాలతో రైతులు నష్ట పో తున్నారని, మిల్లుకు వచ్చిన ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించొద్దన్నారు. తమవద్ద  స్థలం లేదని, ధాన్యం తీసుకోమని చెప్పడం సరికాదన్నారు. జిల్లాలో ని మార్కెట్‌ యార్డులు, ఐకేపీ సెంటర్లలో వరిని కొను గోలు చేశారని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని క లెక్టర్‌ హెచ్చరించారు.  సమావేశంలో  అదనపు కలెక్టర్‌ పద్మజా రాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి శివప్రసాద్‌, హథిరామ్‌, మిల్లర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T04:29:28+05:30 IST