ఉపాధ్యాయుల కొరత

ABN , First Publish Date - 2021-12-09T06:22:52+05:30 IST

సర్కారు పాఠశాలలవైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత తీర్చకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉపాధ్యాయుల కొరత
పాఠశాలల్లో విద్యార్థులు

- జిల్లాలో 293 ఖాళీలు 

- ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య 

- ప్రధానోపాధ్యాయులు  లేక ఇబ్బందులు

- జిల్లాలో 529 ప్రభుత్వ పాఠశాలలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సర్కారు పాఠశాలలవైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.   లాక్‌డౌన్‌ అనంతరం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత తీర్చకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో  ఉపాధ్యాయుల కొరత వేదిస్తోంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో జిల్లాలో ఖాళీల సంఖ్య  293కు చేరింది.  2,323 పోస్టులకు 2030 మంది పనిచేస్తున్నారు. ప్రధానంగా ప్రధానోపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉంది. గ్రేడ్‌ 2 ప్రధానోపాధ్యాయులు 107 మందికి 56 మంది, పీఎస్‌ హెచ్‌ఎం 99 మందికి  53 మంది పనిచేస్తున్నారు. ఖాళీలు కూడా ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  2019- 20 విద్యా సంవత్సరానికి 130 విద్యావలంటీర్ల పోస్టులు మంజూరయ్యాయి. కొవిడ్‌ నేపథ్యంలో వారిని యథావిధిగా కొనసాగించాలని ఉత్వర్వులు రావడంతో వివిధ పాఠశాలల్లో కొనసాగుతున్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో బోధన కొననసాగిస్తుండడం కొంత ఉపవశం కలిగిస్తోది. 

జిల్లాలో 49190 మంది విద్యార్థులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 529 ప్రభుత్వ పాఠశాలల్లో 49,190 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొవిడ్‌ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ద్వారా విద్యాబోధన అందించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. జిల్లాలో 38197 మంది విద్యార్థులను ఉపాధ్యాయులకు అనుసంధానం చేసి ఆన్‌లైన్‌ తరగతులను బోధించారు. 2 వేల వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ‘ఇంటింటా చదువుల పంట’ వాట్సప్‌ ఏర్పాటు చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. జిల్లా విద్యాశాఖ ద్వారా విద్యా సిరి యూట్యూబ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసి తరగతులను నిర్వహించి ముందు నిలిచారు. వినూత్నంగా జిల్లా విద్యాశాఖ ముందుకు పోతున్న ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 


Updated Date - 2021-12-09T06:22:52+05:30 IST