నవీ ముంబైలో అన్ని దుకాణాలూ తెరుచుకోవచ్చు: సర్కార్

ABN , First Publish Date - 2020-08-15T18:17:19+05:30 IST

నవీ ముంబై, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కిరాణా షాపులు శనివారం నుంచి

నవీ ముంబైలో అన్ని దుకాణాలూ తెరుచుకోవచ్చు: సర్కార్

ముంబై : నవీ ముంబై, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కిరాణా షాపులు శనివారం నుంచి తెరుచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంచాలని సూచించారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో సరి-బేసి సంఖ్యలో తెరవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. శనివారం నుంచి ఈ నిబంధనలను సడలించి... అన్ని కిరాణాలూ తెరుచుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.


‘‘ఆయా దుకాణాల వద్ద ప్రజలు, కిరాణా యజమానులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. కోవిడ్ నిబంధనలు పాటించాలి. అయితే హాట్‌స్పాట్, కంటెయిన్‌మెంట్ జోన్ల పరిధిలో ఉన్న దుకాణాలకు ఇది వర్తించదు. అక్కడ మాత్రం సరి- బేసి సంఖ్యలోనే దుకాణాలు తెరవాలి’’ అని నవీ ముంబై మున్సిపల్ కమిషనర్ అభిజిత్ బంగార్ తెలిపారు. 

Updated Date - 2020-08-15T18:17:19+05:30 IST