Whatsapp డీపీగా భార్య ఫొటో పెట్టుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్..!

ABN , First Publish Date - 2022-05-20T14:33:28+05:30 IST

Whatsapp డీపీగా భార్య ఫొటో పెట్టుకుంటున్నారా.. మీకో షాకింగ్ న్యూస్..!

Whatsapp డీపీగా భార్య ఫొటో పెట్టుకుంటున్నారా.. మీకో షాకింగ్  న్యూస్..!

  • వాట్సాప్‌ డీపీగా భార్య ఫొటో 
  • వ్యాపారికి నేరగాళ్ల షాక్‌..
  • మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న కేటుగాళ్లు

హైదరాబాద్‌ సిటీ : వాట్సాప్‌ (Whatsapp)  డీపీలో పెట్టుకున్న ఓ మహిళ (Women) ఫొటోను కొందరు కేటుగాళ్లు మార్ఫింగ్‌ (Morphing)  చేసి సదరు భర్తకే ఫొటోను పంపి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేకుంటే ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో (Social Media) పెడతామంటూ హెచ్చరించారు. దీంతో సదరు వ్యాపారి డీపీలో (DP) నుంచి భార్య (Wife) ఫొటోను తొలగించి సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. రాజ్‌కుమార్‌ (పేరు మార్చాం) ఓ వ్యాపారి. వాట్సాప్‌ డీపీలో అతను తన భార్య ఫొటోను పెట్టాడు. కొద్దిరోజుల క్రితం అతనికి ఒక వాట్సాప్‌ కాల్‌ వచ్చింది.


అసలేం జరిగింది..!?

‘మేం అడిగినంతా డబ్బులు ఇవ్వాలి.. లేదంటే నీ భార్య అశ్లీల ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తాం’ అని బ్లాక్‌మెయిల్‌ (Blackmail) చేశారు. హెచ్చరికగా అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసిన ఒక ఫొటోను వాట్సాప్‌లో పంపారు. వెంటనే సదరు వ్యాపారి సైబర్‌ క్రైం (Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫోన్‌ నంబర్‌, ఇతర టెక్నికల్‌ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతను గతంలో రాజ్‌కుమార్‌ వద్ద వ్యాపార లావాదేవీలు నడిపిన వ్యక్తిగా గుర్తించారు. వ్యాపారంలో భాగంగా రాజ్‌కుమార్‌పై పగ పెంచుకున్న నిందితుడు వాట్సాప్‌ డీపీలోని అతని భార్య ఫొటోను డౌన్‌లోడ్‌ (Download) చేసి, అశ్లీల చిత్రంగా మార్ఫింగ్‌ చేశాడు. దాన్ని సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించి రాజ్‌కుమార్‌ వద్ద డబ్బులు లాగాలని పథకం వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.


డీపీలతో జర పైలం.. 

కొంతమంది సైబర్‌ కేటుగాళ్లు వాట్సాప్‌ డీపీలు, స్టేటస్‌లనుంచి ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసి అశ్లీలంగా మార్ఫింగ్‌ చేస్తూ కొత్త దందాకు తెరతీస్తున్నారు. సాధ్యమైనంత వరకు డీపీలు, స్టేటస్‌లో మహిళల ఫొటోలు పెట్టకపోవడమే ఉత్తమం. - సైబర్‌ క్రైం ఏసీపీ.

Updated Date - 2022-05-20T14:33:28+05:30 IST