సూర్యాపేట: కోదాడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి షాక్ తగిలింది. ఆదివారం కోదాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఉత్తమ్ పోటీ చేస్తే వార్ వన్ సైడ్ అవుతుందని కార్యకర్తలు స్పష్టం చేశారు. ఉత్తమ్ కాకుండా మరో అభ్యర్థిని ప్రకటిస్తే ఒప్పుకోమని.. కోదాడ పట్టణ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి స్టేజిపైనే తెగేసి చెప్పారు. 2018 ఎన్నికల్లోనే అభ్యర్థి ప్రకటనలో పొరపాటు జరిగిందని వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వరప్రసాద్ రెడ్డి కామెంట్స్‌తో ఉత్తమ్ ఉలిక్కిపడ్డారు.