తృణమూల్‌కు షాక్‌

ABN , First Publish Date - 2020-11-28T07:48:59+05:30 IST

తృణమూల్‌ కాంగ్రె్‌సకు గట్టి షాక్‌ తగిలింది. తిరుగుబాటు నేత, రవాణ శాఖ మంత్రి సువేందు అధికారి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మిహిర్‌ గోస్వామి పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరిపోయారు.

తృణమూల్‌కు షాక్‌

మంత్రిపదవికి సీనియర్‌నేత 

సువేందు అధికారి రాజీనామా

మరో తృణమూల్‌ ఎమ్మెల్యే 

పార్టీకి గుడ్‌బై, బీజేపీలో చేరిక


కోల్‌కతా/న్యూఢిల్లీ  నవంబరు 27: తృణమూల్‌ కాంగ్రె్‌సకు గట్టి షాక్‌ తగిలింది. తిరుగుబాటు నేత, రవాణ శాఖ మంత్రి సువేందు అధికారి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. మరో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మిహిర్‌ గోస్వామి పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరిపోయారు. సువేందు తన రాజీనామా పత్రాన్ని   ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఫ్యాక్స్‌ ద్వారా అందజేశారు. ఆ కాపీని గవర్నర్‌ జగ్‌దీప్‌ ధంకర్‌కు ఈ-మెయిల్‌ ద్వారా  పంపించారు. అయితే ఎమ్మెల్యే పదవికి మాత్రం అధికారి రాజీనామా చేయలేదు.  మంత్రి పదవి నుంచి తప్పుకున్న వెంటనే ప్రభుత్వం కల్పిస్తున్న జడ్‌ కేటగిరి సెక్యూరిటీని ఆయన తిరస్కరించారు. మంత్రిపదవితోపాటు   త్వరలో ఆయన ఏకంగా పార్టీకే గుడ్‌బై చెబుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారి పార్టీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. లోక్‌సభ ఎంపీ, సీఎం మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి  పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తుండడం పట్ల అధికారి అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. కాగా, సువేందును తమ పార్టీలో చేరాలంటూ బీజేపీ ఆహ్వానించింది.

Updated Date - 2020-11-28T07:48:59+05:30 IST