శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహస్తాం

ABN , First Publish Date - 2021-03-01T05:51:31+05:30 IST

మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ మల్లికార్జునప్రసాద్‌ తెలిపారు.

శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహస్తాం

  1.  మహానంది ఈవో మల్లికార్జున ప్రసాద్‌


మహానంది, ఫిబ్రవరి 28: మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ మల్లికార్జునప్రసాద్‌ తెలిపారు. ఆదివారం రాత్రి మహానంది ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికలతో పాటు వాల్‌ పోస్టర్లను ఈఓతో పాటు దాతలు, వేదపండితులు పాల్గొని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆలయప్రధాన అర్చకులు మామిళ్ళపల్లి అర్జునశర్మ, వేదపండితులు ఆహ్వానపత్రికలను ఉత్సవమూర్తుల విగ్రహాల ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ మార్చి 9 నుంచి జరిగే 14 వరకు 6 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకై ఏర్పాట్ల పనులను ముమ్మరం చేసామన్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మామిళ్ళపల్లి అర్జునశర్మ, శేషుశర్మ, ధర్మతేజతో పాటు టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ హరినాధ్‌, బ్రహోత్సవాల కళ్యాణం దాత నంద్యాలకు చెందిన టి. రామన్న సన్స్‌ అధినేత లక్కబోయున ప్రసాద్‌, బ్రహోత్సవాల ఆహ్వానపత్రికల దాత పవన్‌, మహానంది వ్యాపారసంఘం అధ్యక్షుడు భవనాశి రమణయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T05:51:31+05:30 IST