Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 29 Jun 2022 00:10:52 IST

గురుకులంలో మెరిసిన ఆణిముత్యాలు

twitter-iconwatsapp-iconfb-icon
గురుకులంలో మెరిసిన ఆణిముత్యాలుసిద్దిపేట మండలం ఎన్సాన్‌పల్లి పాఠశాలలో విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు

ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు 

సిద్దిపేట అర్బన్‌/రూరల్‌, జూన్‌ 28: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మిట్టపల్లి విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. మొత్తం ఫలితాల్లో మొదటి, రెండో సంవత్సరం కలిపి 98 శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్‌ లక్ష్మాంజలి మంగళవారం తెలిపారు. బైపీసీ ప్రథమ సంవత్సరంలో ఏ.శృతి 440/435 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. అలాగే సౌజన్య 434 మార్కులు, రాజేశ్వరి 433, కరుణదీప్తి 433, సుస్మిత 432 మార్కులు సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచారని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకుగాను గంగోత్రి 466 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకు సాధించింది. అర్చన 464, సాయిప్రసన్న 464, సింధుశ్రీ 463, ఎస్‌.వైష్ణవి 462, అక్షయ 461, సంజన 460 మార్కులు సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తం మీద రాష్ట్రస్థాయిలో మొదటి పది స్థానాల్లో ఎంపీసీ నుంచి ఏడుగురు, బైపీసీ నుంచి ఐదుగురు విద్యార్థులు మొదటి ఐదు ర్యాంకులు సాధించారు. 72 మంది విద్యార్థుల్లో 40 మందికి 400 పైగా మార్కులు వచ్చాయి. రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌ వీ.లక్ష్మాంజలి, సిబ్బంది అభినందించారు.

ఎన్సాన్‌పల్లి గురుకుల పాఠశాలలో

ఇంటర్‌ ఫలితాల్లో ఎన్సాన్‌పల్లి గురుకుల పాఠశాల విద్యార్థినులు సత్తాచాటినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో సాయిశ్రీ 470/467, స్ఫూర్తి 466, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో శ్వేత 985 మార్కులు సాధించినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం బైపీసీలో సాయి స్రవంతి 440/434, అనూష 440/434 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు.

సిద్దిపేట రూరల్‌ మండలంలో 

సిద్దిపేట రూరల్‌, జూన్‌ 28: సిద్దిపేట రూరల్‌ మండలం చిన్నగుండవెల్లి గ్రామ శివారులో గల మైనార్టీ బాలుర గురుకుల కళాశాల ఇంటర్‌ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో శివకుమార్‌ 470/464 మార్కులు, ఆసిఫ్‌ 457, మధుసూదన్‌ 452 మార్కులు సాధించారు. రెండో సంవత్సరం ఎంపీసీలో మిరాజ్‌ ఉద్దీన్‌ 1000/964, కమలాకర్‌రెడ్డి 954, బైపీసీలో పీ.రాజు 949, అమీర్‌ 927 మార్కులు సాధించారని మైనార్టీ బాలుర కళాశాల ప్రిన్సిపాల్‌ రాజిరెడ్డి తెలిపారు. ఇర్కోడ్‌ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎం.శాలిని 470/448, ఎస్‌.కుశ్వంత్‌ 445, బైపీసీలో త్రిష 440/429, సీఈసీలో ఎస్‌.ఐశ్వర్య 500/474, ఎం.మానస 438, రెండో సంవత్సరం ఎంపీసీలో ఏ.ప్రీతి 1000/985, మామిడి హర్షవర్ధన్‌ 950, బైపీసీలో ఎం.శివాణి 944 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్‌ నాగరాజు తెలిపారు. 

మెరిసిన ప్రభుత్వ కళాశాల ఆణిముత్యం

హుస్నాబాద్‌, జూన్‌ 28: ఇంటర్‌ ఫలితాల్లో హుస్నాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన నాగవెల్లి స్నిగ్దా బైపీసీలో 440/433 మార్కులు సాధించింది. ఎంపీసీలో గుంటుపల్లి అశ్విత 470/458, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పీ.ఉమాదేవి ఎంపీసీలో 1000/943, బైపీసీలో సీహెచ్‌.హారిక 1000/931 మార్కులు సాధించింది. మోడల్‌ కళాశాలకు చెందిన శాలిని బైపీసీలో 1000/980 మార్కులు సాధించింది. 

మోడల్‌స్కూల్‌ ప్రభంజనం

మద్దూరు, జూన్‌ 28: ఇంటర్‌ ఫలితాల్లో మద్దూరు మండలం మోడల్‌ స్కూల్‌ 95 శాతం ఉత్తీర్ణత సాధించింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో హుదా కౌజర్‌ 963 మార్కులు, బైపీసీలో ఫాతిమా జహారా 960, సీఈసీలో జీ.రాజు 731 మార్కులు, ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో ముగ్గురు 417 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్‌ వై.శ్రీహరి తెలిపారు.

వర్గల్‌ మండలంలో 

వర్గల్‌, జూన్‌ 28: వర్గల్‌ మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరంలో 83 శాతం, మొదటి సంవత్సరంలో 51 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 59 మంది, రెండో సంత్సరంలో 60 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం ఎంపీసీలో పీ.స్రవంతి 886, బైపీసీలో పావనిత 858, సీఈసీలో పావని 732 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. 

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు

చిన్నకోడూరు, జూన్‌ 28: చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీకి చెందిన వీ.దివ్య 1000/899, బైపీసీకి చెందిన జే.అర్చన 947, సీఈసీకి చెందిన పీ.శ్రావణి 689 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీకి చెందిన ఎం.రేష్మ 470/459, బైపీసీకి చెందిన జే.అమూల్య 440/429, సీఈసీకి చెందిన బీ.అంకిత 500/443 సాధించారు. ప్రథమ సంవత్సరంలో 98 శాతం, ద్వితీయ సంవత్సరంలో 96.55 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌లో

ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌లో ద్వితీయ సంవత్సరం ఎంపీసీకి చెందిన జీ.రాజు 1000/916 మార్కులు, బైపీసీకి చెందిన ఎస్‌.భవిత 954, సీఈసీకి చెందిన బీ.మణికంఠ 802 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీకి చెందిన కే.అక్షయశ్రీ 470/459, బైపీసీకి చెందిన కే.నందిని 440/429, సీఈసీకి చెందిన బీ.అంజలి 500/433 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో 96.26 శాతం, ద్వితీయ సంవత్సరంలో 98.23 శాతం ఉత్తీర్ణత సాధించారు.

మోడల్‌ స్కూల్‌ ఆదర్శం

నంగునూరు, జూన్‌ 28: ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో నంగునూరు మండలంలోని అక్కెనపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్‌ సైదిరెడ్డి తెలిపారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 150 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 140 మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఆదర్శ మోడల్‌ స్కూల్‌లో 93.3 శాతంతో పాస్‌ అయ్యారని తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 79 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 72 మంది పాస్‌ కాగా 91.1 శాతంగా నిలిచారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 71 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 68 మంది పాస్‌ కాగా 95.7 శాతంగా ఉత్తీర్ణులు అయ్యారు. నంగునూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరంలో 94 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 70 మంది విద్యార్థులకు 70 మంది ఉత్తీర్ణత సాధించారు.

ములుగు ప్రభుత్వ కళాశాలలో 89 శాతం ఉత్తీర్ణత

ములుగు, జూన్‌ 28: ములుగు మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరంలో 60 మంది, రెండో సంవత్సరంలో 94 మంది విద్యార్థులకుగాను 84 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి, రెండో సంవత్సరం కలుపుకుని మొత్తం 89 శాతం ఉత్తీర్ణత సాధించారు. క్షీరసాగర్‌ గ్రామానికి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థిని టీ.భవాని బైపీసీలో 929 మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచినట్టు ప్రిన్సిపాల్‌ బుచ్చిరెడ్డి తెలిపారు.

సత్తాచాటిన గ్రామీణ విద్యార్థులు

మిరుదొడ్డి, జూన్‌ 28: ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో మిరుదొడ్డి మండల గ్రామీణ ప్రాంత విద్యార్థులు సత్తాచాటారు. మిరుదొడ్డి ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరంలో బొండం మైత్రి ఎంపీసీలో 1000/968, అల్వాల మైత్రి బీపీసీలో 1000/917, చేర్ల కీర్తనా సీఈసీలో 1000/831, మొదటి సంవత్సరంలో గూడూరి శ్రీనిత 470/457, బీపీసీలో బెంద్రం సాయిశ్రీ 440/429 మార్కులు సాధించారు. రెండో సంవత్సరంలో 94 శాతం, మొదటి సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు ప్రిన్సిపాల్‌ భారతి తెలిపారు. అలాగే అల్వాల్‌ గురుకుల పాఠశాలలో మొదటి సంవత్సరంలో 100 శాతం, రెండో సంవత్సరంలో 98 శాతం ఉత్తీర్ణతను సాధించినట్టు ప్రిన్సిపాల్‌ ధనలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో రెండో సంవత్సరంలో 80 శాతం, మొదటి సంవత్సరంలో 68 శాతం, ఒకేషనల్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 

రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన అక్కాచెల్లెళ్లు

చేర్యాల, జూన్‌ 28: ఇంటర్‌ ఫలితాల్లో కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు బొంగు నిత్యరెడ్డి, దివ్యరెడ్డి రాష్ట్రస్థాయిలో మూడు, నాలుగు ర్యాంకులు సాధించారు. హైదరాబాద్‌లోని నారాయణ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో దివ్యరెడ్డి 986 మార్కులతో రాష్ట్రంలో నాలుగో ర్యాంకు సాధించగా, సీఎంఎస్‌ కళాశాలలో చదువుతున్న నిత్యరెడ్డి ప్రథమ సంవత్సరం ఎంఈసీ విభాగంలో 497 మార్కులతో మూడో ర్యాంకు సాధించింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇరువురు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం పట్ల సర్పంచ్‌ భీమనపల్లి కరుణాకర్‌ విద్యార్థులకు మిఠాయి తినిపించి అభినందనలు తెలిపారు. 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ టాపర్లు వీరే

చేర్యాల, జూన్‌ 28: ఇంటర్‌ ఫలితాల్లో చేర్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మిశ్రమ ఫలితాలు సాధించింది. ప్రథమ సంవత్సరంలో 60 మందికిగాను 10 మంది, ద్వితీయ సంవత్సరంలో 74 మందికిగాను 40 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌ ద్వితీయ సంవత్సరంలో బొడ్డు రాహుల్‌ 863 మార్కులు, బైపీసీ విభాగంలో బూర నవీన్‌కుమార్‌ 779 మార్కులతో టాపర్లుగా నిలిచినట్లు ప్రిన్సిపాల్‌ సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. అలాగే చేర్యాల మండలం ముస్త్యాల మోడల్‌ స్కూల్‌లో ప్రథమ సంవత్సరంలో 66 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 47 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 453 మార్కులతో పొన్న అనూష, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఈరి మనూష 928 మార్కులతో టాపర్లుగా నిలిచారు.

మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల ప్రతిభ

కొండపాక, జూన్‌ 28: ఇంటర్‌ ఫలితాల్లో కొండపాక ప్రభుత్వ కళాశాల, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ తెలిపారు. మోడల్‌ స్కూల్‌లో ద్వితీయ సంవత్సరం 96 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరంలో 84 శాతం సాధించినట్లు ప్రిన్సిపాల్‌ వనీసా తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో వెలికట్ట సౌమ్య అనే విద్యార్థిని 917 మార్కులు సాధించిందన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 70 మంది ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్‌ ఇందిరాదేవి తెలిపారు. 

సత్తా చాటిన ‘గీతాంజలి’

గజ్వేల్‌, జూన్‌ 28: ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో గీతాంజలి విద్యాసంస్థ సత్తాచాటింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో జిల్లా ద్వితీయ ర్యాంకును కళాశాలకు చెందిన సౌరబ్‌వర్మ 988 మార్కులతో, బైపీసీ జిల్లా ప్రథమర్యాంకు ఫరీనా 988, జిల్లా ద్వితీయ ర్యాంకు ఆర్‌.శ్రీవాణి 987 మార్కులతో సాధించారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో అనితా రాథోడ్‌ 464 మార్కులతో జిల్లా ద్వితీయ ర్యాంకు, పీ.జగన్‌రెడ్డి బైపీసీ 434లో జిల్లా ద్వితీయ ర్యాంకు సాధించారు. మొదటి సంవత్సరంలో 400 మార్కులకుపైగా 90 మంది విద్యార్థులకు, ద్వితీయ సంవత్సరంలో 900ల మార్కులకు పైగా 30 మంది విద్యార్థులు సాధించారని కళాశాల కరస్పాండెంట్‌ వీ.మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

‘జీఎంఆర్‌’ ప్రతిభ

గజ్వేల్‌, జూన్‌ 28: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జీఎంఆర్‌ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో సుమనశ్రీ 987, కరుణాకర్‌ 978, బైపీసీలో సన 979, స్నేహా 974, సీఈసీలో మీర్జాఅలియా 953, ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీలో విఘ్నేష్‌ 462, బైపీసీలో హాస్య 428, సీఈసీలో హర్షిత 465 మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్‌ గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ రామచంద్రారెడ్డి తెలిపారు. 

జిల్లా ప్రథమ ర్యాంకు సాధించిన విశ్వతేజ విద్యార్థిని

గజ్వేల్‌, జూన్‌ 28: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో విశ్వతేజ కళాశాలకు చెందిన విద్యార్థిని మైత్రీఅర్యానీ 1000/990 మార్కులు సాధించి జిల్లా ప్రథమ ర్యాంకును కైవసం చేసుకున్నది. అదేవిధంగా సీఈసీ ప్రథమ సంవత్సరంలో కళాశాలకు చెందిన సీహెచ్‌.జ్యోతి 500/486 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం దక్కించుకున్నది. ఈ సందర్భంగా మైత్రీఅర్యానీ, జ్యోతిని కళాశాల కరస్పాండెంట్‌ శౌరయ్య, ప్రిన్సిపాల్‌ రాజు అభినందించారు. 

మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 

గజ్వేల్‌, జూన్‌ 28: గజ్వేల్‌ పట్టణానికి చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇంటర్‌ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో అజయ్‌ 981, విద్యాసాగర్‌ ఎంటీలో 935, బైపీసీలో వంశీ 882, ఒకేషనల్‌ ఈఅండ్‌సీటీలో శ్రీకాంత్‌ 952, మొదటి సంవత్సరం ఎంపీసీలో హర్షవర్ధన్‌ 470 మార్కులకుగాను 455, దుర్గాప్రసాద్‌ బైపీసీలో 440 మార్కులకుగాను 406 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ వాసవి తెలిపారు.


గురుకులంలో మెరిసిన ఆణిముత్యాలురాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన కొమురవెల్లి మండలం కిష్టంపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు నిత్యరెడ్డి, దివ్యరెడ్డికి అభినందనలు తెలుపుతున్న సర్పంచ్‌ భీమనపల్లి కరుణాకర్‌


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.