హైదరాబాద్: అధిక వడ్డీ ఇస్తానంటూ కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరిని రెండు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. రిమాండ్‌లో శిల్పాను మరికొద్దిసేపటిలో నార్సింగి పోలీసుల కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు నమోదైన ఐదు కేసులకు సంబంధించి విచారణ చేయనున్నారు. కోట్ల రూపాయల ఎగవేతపై శిల్పాను పోలీసులు విచారించనున్నారు.