ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీలో ముందంజ

ABN , First Publish Date - 2022-05-20T05:10:18+05:30 IST

ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో

ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీలో ముందంజ
మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌

  • రాష్ట్ర స్థాయిలో జిల్లాకు దక్కిన మూడు ప్రతిష్టాత్మక అవార్డులు 
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా అవార్డులను అందుకున్న డీఆర్‌డీవో పీడీ ప్రభాకర్‌


రంగారెడ్డి అర్బన్‌, మే 19 : ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు దక్కాయి. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పీఆర్‌అండ్‌ఆర్డీ సెక్రటరీ సందీ్‌పకుమార్‌ సుల్తానియా చేతుల మీదుగా డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌ అవార్డులను అందుకున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి ఆధ్వర్యంలో గ్రామీణ మహిళా సాధికారత కార్యక్రమాల అమలులో భాగంగా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ కార్యక్రమం ద్వారా మహిళలకు నూతన జీవనోపాధులను ప్రోత్సహించి తద్వార మహిళల ఆర్థిక అభివృద్ధిని సాధించడంలో రంగారెడ్డి జిల్లా విజయ సాధనంలో ముందువరుసలో ఉంది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌హెచ్‌జీలకు రూ.563.57 కోట్లు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించగా రూ.612.69 కోట్లు ప్రగతిని సాధించింది. లక్ష్య సాధనలో అత్యంత ప్రతిభ కనబర్చిన శంషాబాద్‌ మండలం నర్కుడ కెనరా బ్యాంక్‌, ఇబ్రహీంపట్న మండల సమాఖ్య, కడ్తాల మండలానికి అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ప్రోత్సాహం, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సూచనల మేరకు ఈ లక్ష్యాన్ని అధిగమించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. 



Updated Date - 2022-05-20T05:10:18+05:30 IST