శతచండీ యాగంలో పాల్గొన్న వేద పండితులు, ఎమ్మెల్యే కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్
కాగజ్‌నగర్ రూరల్, జనవరి 22: కాగజ్‌నగర్ మండలం ఈసుగాం శివాలయంలో మూడు రోజుల పాటు జరిగే రుద్రహవన సహిత శత చండీయాగం శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అచ్చలాపూర్ మహదేవ వేదపాఠశాల ప్రిన్సిపాల్ దుద్దిళ్ల మనోహర అవధాని ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు వేదమంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుదేవతా ప్రార్థన, గణపతిపూజ, పూణ్యాహవచనం, యాగశాల సంస్కారం, సహస్ర మోదక గణపతిహవనం, గోపూజ, చండీపారాయణాలు, మహాన్యాస పూర్వక రుద్రా భిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనప్ప, ఎమ్మెల్సీ దండేవిఠల్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఇందా రపు రాజేశ్వర్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీష్ తదితరులు పాల్గొన్నారు.