రోజుంతా 30 మందితో శశికళ మంతనాలు
ABN , First Publish Date - 2021-06-30T14:08:07+05:30 IST
అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ తన వ్యూహా లకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ 30 మందితో ఆమె
- అనుయాయుల కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు
అడయార్(చెన్నై): అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ తన వ్యూహా లకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ 30 మందితో ఆమె మంతనాలు జరుపుతున్నారు. అంతేకాకుండా, వీరందరిని సమన్వ యం చేసేం దుకు వీలుగా శశికళ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ నేతలతో శశికళ సంభాషించే సమయంలో పార్టీ జెండాతో పాటు పార్టీని ఏ విధంగా కైవసం చేసుకోవాలన్న అంశంపై చర్చిస్తూ, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. వాస్తవానికి జయ జీవించి వున్న సమయంలో శశికళ అనధికార కేంద్రంగా కొనసాగారు. అయితే, జయ మరణంతో శశికళ హవా కనుమరుగైపోయింది. ఇదిలా ఉండగా తాజా సమాచారం మేరకు ఆమె ప్రతి రోజూ కనీసం 30 మందికి తగ్గకుండా మాట్లాడుతున్నారు. వీరితో సమ న్వయం చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బృందం త్వరలోనే కీలక నేతలను సంప్రదించనున్నట్టు సమాచారం. టి.నగర్లో ఉంటున్న శశికళకు ఆమె వదిన ఇళవరసి, ప్రత్యేక కార్యదర్శి కేఈ కార్తికేయన్ సహా మరో నలుగురు పూర్తి సహకారాలు అందిస్తు న్నారు. అంతేకాకుండా, శశికళ భర్త దివంగత నటరాజన్ సోదరులు కూడా ఆమెకు అండగా నిలిచారు. మరోవైపు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను కొనసాగించాలని పలువురు అన్నాడీఎంకే నేతలు కోరుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే తూత్తుకుడి ఉత్తర జిల్లా విభాగం ఒక తీర్మానాన్ని కూడా చేసింది. అలాగే, మరికొన్ని జిల్లాల్లో కూడా శశికళకు అనుకూలంగా తీర్మానాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, శశికళ త్వరలోనే రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఆగస్టు 18న తన జన్మదిన వేడుకల తరువాత ఆమె రాష్ట్ర పర్యటనను ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.