నేడు గంగదేవిపాడుకు షర్మిల

ABN , First Publish Date - 2021-07-20T05:15:44+05:30 IST

రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్‌ షర్మిల ఆపార్టీ అధ్యక్షురాలి హోదాలో మంగళవారం తొలిసారి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

నేడు గంగదేవిపాడుకు షర్మిల

నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబానికి పరామర్శ

పెనుబల్లిలో ఉద్యోగ నిరసన దీక్ష

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలి హోదాలో తొలిసారి జిల్లాకు 

ఖమ్మం, జూలై 19 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్‌ షర్మిల ఆపార్టీ అధ్యక్షురాలి హోదాలో మంగళవారం తొలిసారి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఇటీవల పురుగుమందుతాగి ఆత్మహత్య చేసుకున్న పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి సానిక నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి, ఆతర్వాత పెనుబల్లిలో జరిగే నిరుద్యోగ నిరసన దీక్షలో ఆమె పాల్గొంటారు. ఉదయం 5:25గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి ఉదయం 9:15కుగంగదేవిపాడు చేరుకుని నాగేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 9:30గంటలకు పెనుబల్లి చేరుకుని నిరుద్యోగులనిరసన దీక్షలో పాల్గొంటారు. షర్మిల పర్యటన కోసం ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. అయితే తాను తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్టు ఖమ్మంలో సంకల్పసభ సభ నిర్వహించిన ప్రకటించిన షర్మిల ఇటీవల పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత ఆ పార్టీ అధ్యక్షరాలి హోదాలో ఖమ్మం జిల్లాలో తొలి పర్యటిస్తుండటంతో విజయవంతం చేసేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ సంఘాల నేతలను కూడా ఆహ్వానించారు. ఇక ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఏపీలోని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలనుంచి కూడా వైఎస్‌ అభిమానులు, నిరుద్యోగులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. 

Updated Date - 2021-07-20T05:15:44+05:30 IST