Advertisement
Advertisement
Abn logo
Advertisement

షావోమీ నుంచి సెల్ఫ్‌ రిపెయిర్‌

మొబైల్‌ ఫోన్‌లు చెడిపోయాయా... అయితే రిపెయిర్‌ షాప్‌లు ఎక్కడున్నాయో అని వెతుక్కో అక్కర లేదు. ఇప్పుడు డివైస్‌లను సొంతంగా రిపెయిర్‌ చేసుకునే వెసులుబాటు మొదలైంది. ఇటీవలే యాపిల్‌ దీనికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఆ బాటలోనే షావోమీ నడుస్తోంది. ‘షావోమీ కేర్‌ రిపెయిర్‌ ప్రోగ్రామ్‌’ను త్వరలోనే ఆరంభంకానుంది. రాబోయే ఈ సర్వీస్‌ను ట్విట్టర్‌లో కంపెనీ ప్రకటించింది. అందులో షేర్‌ చేసిన ఇమేజ్‌ ఈ విషయాన్ని స్పష్టంగా చూపింది. తద్వారా మెరుగైన సేవలను అందించడానికి తోడు మరమ్మతుకు అవసరమైన పరికరాలు, మాన్యువల్స్‌, పార్టులను పరిచయం చేసింది.  షావోమీ మనదేశంలోనే మొదట దీన్ని పరిచయం చేస్తోంది. తదుపరి రోజుల్లో షావోమీ ఫ్యాన్లు తదితర ఉత్పత్తులకూ దీన్ని విస్తరించనున్నట్టు కంపెనీ తెలిపింది. ‘షావోమీ కేర్స్‌’ పేరిట ఇది ఇండియాలో కొనసాగనుంది. 

Advertisement
Advertisement