Shamshabad ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2021-12-14T16:21:47+05:30 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎఫ్‌జడ్‌ 439 విమానంలో సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు

Shamshabad ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్/శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎఫ్‌జడ్‌ 439 విమానంలో సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికుడు బంగారాన్ని కరిగించి కరెంట్‌ వోల్టేజ్‌ యూపీ, ఏసీ కన్వెటర్‌లో తరలిస్తున్నారు. విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు చేయగా అతడి వద్ద 316.40 గ్రాముల బంగారం దొరికింది. అతడిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపలేదు. పట్టుబడ్డ బంగారాన్ని స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశామని అధికారులు వెల్లడించారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.15.71 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. 

Updated Date - 2021-12-14T16:21:47+05:30 IST