హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో ఓ ప్రయాణికుని వద్ద బంగారాన్ని అధికారులు పట్టుకున్న్నారు. గౌహతి నుండి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుని వద్ద 472.8 గ్రాముల బంగారం పట్టుబడింది. సదరు వ్యక్తి పేస్ట్ రూపంలో బంగారం తరలించేందుకు యత్నించాడు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.23.33 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.